మొక్క చిగురంత ఆకుపచ్చ
చెట్టంత కవిత్వం ప్రకృతిలో విశ్వంభర పూల పరిమళం
జగమంత పల్లె నవ్వులో
ఊరు మాట్లాడింది పచ్చగ మైదాన బతుకై
ఎదిగినకొద్దీ ఒదిగిన జ్ఞన సముద్రం
పొడుచుకొచ్చి పేజీలలో భాష
వయ్యిగా వికసించే
శతగ్రంథ వసంత యామిని
ప్రతి వసంతసీమలో ఒక పూవు వెదజల్లే వాసన నవ్వని పువ్వు తొలుత
ఎనుబదియారు వసంతాల ఘన జీవితం
ఎనబదియారు గ్రంథాల పేరు తన కవిత్వం
రాసింది హన్మాజీపేట నేత్రం
మానేరు తీరం నుండి హుసేన్ సాగర్ వరకు
సాలుకొక్క రసబీజాక్షర పొత్తం
ముసిముసి నగవుల నెరజాణ చిత్తం
చెట్టంత కవిత్వం కురిసిన మధు కలశం
మనసంత సృజన వెండి కంచం
తిని తాగిన ఎలనాగ కనుల
రసరమ్య గీతాల గనులు
కర్పూర వసంతరాయలు లకుమా కావ్య రమణి మణిహారం
నాగార్జున సాగరం సాంస్కృతిక అలల సింగార మంజీరవ సంపుటి
వినువీధుల రెపరెపల చేలాంచనం కవితా కన్నెల హొయలు
ఋతుచక్రం సాగింది వీచికల
సెలయేటి నృత్యగీతాలాపనగా
రెక్కలు విప్పిన నడక నా తల్లి
మంటలు మానవుడు ఆత్మీయ మానవీయత నింపే
అక్షర గవాక్షాల చదువలమ్మ వీణియ మీటే
సిరి వెలుగు కవిత జగమంత సినారె
మనిషి ఒక్కడే సినారె
బుచ్చమ్మ కొడుకు రక్తజన్మ లాలి సంతకం
మల్లన్న తండ్రి మేడి పట్టిన చేతుల ఊగిన జోల చిరునామా
కళలరేడు కళల సూరీడు
కవితా సరస్వతి పలికిన పేర్లు నూరు తీర్లు
సంపుటికొక్క పేరు మధ్యతరగతి మందహాసం అలలెత్తిన అడుగలు
కవి కంఠీరవ బడిలో హృదయోల్లాస వ్యాఖ్యల విద్యా దివాకరుడు
ఒక పేరుతో అనంత విన్యాస విపంచి
బహునామ గ్రంథాల అబ్భుత విరించి
వాసిలో రాశిలో బలాదూర్ రిమ్ జిమ్ అక్షరమాల హైదరబాద్
మనసంతా భాగ్యనగర్ చార్ మినారు
చూసినారే ఎంత రాసినా సినారె ఎదిగినా అంత ఒదిగిన పక్షి నయన సినారె
కృష్ణవేణి తరంగినుల గోదావరి నురగల జలకన్యలు
సుందర గమన స్నిగ్ధ కలహంసలు కదలి కడలి నృత్యాల కావ్య రచనల వెలిగె సినారె భువిని
మహాజ్వల భావోద్వేగ దీర్ఘకావ్యం సినారె
******
జూలై 29న సినారె జన్మదినం...సందర్భం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి