ఎన్నాళ్ళు ఇలా?: - ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ ( పుష్యమి)-విశాఖపట్నం-9963265762

 

 మూడు డోస్ ల మందు వేసుకున్నాం
మూతి గుడ్డలు పూర్తిగా తీసేసాం
ముచ్చెమటలు పోయించిన
మహమ్మారి పోయిందని
మనుషులంతా కలసి
మనసు విప్పి మాట్లాడుకోవచ్చునని
మనకిక భయంలేదు
మనుమలను చూసి
మూడేళ్ళయింది ఎలా ఉన్నారో రమ్మంటున్నారని
మనకిక వీడియోలో చూసే భాధ తప్పిందని
మా ఇంటి ఇల్లాలు చెప్పినట్లు
మావాడి దగ్గరకు వెళదాం అనుకుని
మూడు నెలల క్రిందటే  బుక్ చేసిన టిక్కెట్ 
మరల కరోనా విజృభిస్తున్న వేళ
మరింత జాగ్రత్త అంటున్న ప్రభుత్వం
మీరెల వెళతారని చెప్పిన
మా ఊరివాళ్ళు
మాకేమి ఎక్కడైనా ఒక్కటే అని
మొండిగా చెప్పినా లోలోన భయం ఎన్నాళ్ళు ఇలా?
..................................

కామెంట్‌లు