సాటిలేని స్నేహము : - -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు, సెల్ :9966414580

 

శ్రేష్టమైన స్నేహము 
సృష్టిలో భాగ్యము 
కల్గియుంటే గనుక 
అత్యంత అదృష్టము 

చిన్ననాటి స్నేహము 
తెలుగు వోలె మధురము 
అరుణోదయం లాగ 
జీవితాన తేజము 

సాటి లేని స్నేహము 
లేదు ఏది సమానము 
జీవకోటికి దొరికిన 
దేవుని బహుమానము 

స్నేహమే  సున్నితము 
చేయరాదు ద్రోహము 
బలమైన నమ్నకము 
పరికింప ఉత్తమము 

స్నేహం మణిహారము
మేలిమి బంగారము 
దండలో దారంలా 
బ్రతుకున ఆధారము 

స్నేహానికి మించినది 
ఎక్కడా లేదు లేదు 
దుర్గమై నిలుచునది 
హత్తుకుంటే వదలదు 

కామెంట్‌లు