నాడు నేడు: - ఎ.రాజ్యశ్రీ


నాడు గీతాచార్యుడు చెరలో
నేడు కృష్ణమాచార్య జైల్లో 
బలరాముడన్నగా_ రంగాచార్య తమ్ముడుగా
మురళీనాదంతో నాడు,రుద్రవీణతో నేడు
కంసమామ పీచమణిచే
నిజాంబూజు దులిపే 

విశ్వం గా విశ్వరూపందాల్చి 
నిప్పుపూలతో నిప్పులుచెరిగే 
బుద్ధుని నాటికల్లో శాంతిమంత్రాలు పఠించే 

స్రవంతి సంపాదకునిగా బహుముఖాలుగా విశ్వరూపంచూపే 
ఖుషీగా నిషాపాటల్ని, గాలిబ్ గీతాల్ని  చిత్రికపట్టె 

యాత్రాస్మృతి లోసాగిన అనంతయాత్ర"అద్దాలమేడ" లో "నడిరేయి ఏజాములోనో"
పిట్టమనసులోఏముందని
ఆరాతీసిన కవిహృదయం

ఆస్థాన కవిగా అగ్నిధారకురిపించిన, తిమిరంతో సమరంచేసిన,
కళాప్రపూర్ణుడు 
"ఎముకలు మసిజేసి పొలాలుదున్నిన,"
 రైతన్నలకండదండ

"రారా కృష్ణయ్య!" అంటూ నడిరేయి స్వామిసన్నిధికై తపించి తరించిన 
దాశరథి అక్షరం ఆయుధం
శరాలు ఆయన స్వరాలు
తెలుగుభాష కి నడకలు హొయలు నేర్పిన పదమంజీరాలు

....స్వస్తి...
కామెంట్‌లు