సీతాదేవి గూర్చి సుమంత్రుడు కౌసల్యాదేవికి వివరించుట: - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట


\సీతాదేవి పవిత్రమైన హృదయముతో 
శ్రీరాముని యందే నిమగ్నమై యున్నది.
ఆమె జీవితము తన భర్తకే అంకితమొనర్చినది
ఆ తల్లి! గూర్చి నీవు పరితపించకుము 

ఆమె ప్రయాణముచే అలసిపోయిన గాని!
ఎండలకు గాలులకు లోనైనా గాని! 
క్రూర మృగములను చూచిన గాని! 
ఆమె శరీరకాంతి ఏమాత్రం తగ్గలేదు.

మధురభాషినియైన సీతదేవి ముఖము
వికసించిన కమలమువలె యున్నది 
పున్నమిచంద్రుని వలె వెలుగుచున్నది 
ఆమె ముఖకాంతి ఏమాత్రము చెక్కుచెదరలేదు

సీతాదేవి శ్రీరామునిబాహు బలముపై 
నమ్మకముతో వనవాసము చేయుచున్నది 
వనమున ఆమె సంచరించినప్పుడు 
సింహములను చూసిన భయపడుటలేదు 

ఓ కౌసల్యాదేవి! సీతారామలక్ష్మణల గూర్చి 
మీరు ఏమాత్రము దిగులు పడకూడదని
కౌసల్యాదేవిని అతడు ఊరడించినాగాని 
ఆమె పుత్రునిపై ప్రేమతో పరితాపమును వీడలేదు.

=====================================
అయోధ్యకాండమునందు 60వ సర్గ సమాప్తము 🙏🏻
కామెంట్‌లు