కవి రాజు పుట్టినరోజు
కళామతల్లి మురిసింది
కవన బీజం పొటమరించి
మొక్కై మొలచి మహావక్షమై
శాకోపశాఖలుగా విస్తరించి
లక్షలాది కవి చకోరాలకు
నీడనిచ్చింది.......
తెలుగు భాషకు తలమానికమై
తరతరాలకు వెలుగునిచ్చింది.
తెలుగు తల్లి నుదుట తిలకమై
తరతరాలకు దారి చూపే దివ్యలై
అక్షరాలతో అమృతం కురిపించి
కవులకు కడుపు నింపింది.
కన్నీటి కడలిలో తడిసిన కవితలు
కర్తవ్య బోధ చేసే కథనాలు
కాలం గడిచిన చెరగని కీర్తి
కావ్యసుధగా జాలువారింది
కవిరాజు కలం నుండి
జన్మించిన ప్రతి అక్షరం
గుండె గుండెల్లో.....
ఆరని దీపమై వెలిగింది.
ఆయన ఒక విశ్వవిద్యాలయం.
నవలాకారుడు,విమర్శకుడు
ఆయన రచనల్లో
మానవత్వం, తాత్వికత,
భాషా సౌందర్యం, భావ పఠిమ
అన్నీ కలిపిన మహా తపస్వి.
అక్షరాల రాజ్యానికి చక్రవర్తివి !
ఆలోచనల సింహాసానికి
అధిపతివి.
మట్టి మనిషి మనసులను
పలికించిన మహాకవివి !!
తెలుగు తల్లి ముద్దు బిడ్డవు !!
" అనంత జీవనం" లో....
అనంత జీవనం అంటే
బయటి ప్రపంచం కాదు
జీవితం పుట్టుక
చావు మధ్య కథ కాదు.
మట్టి నుంచి మనిషి,
మనిషి నుంచి దేవుడి దాకా
సాగే ప్రయాణం.
మట్టి మనిషి ఎదుగుదల,
మానవత్వం వెతుక్కునే
అనంత ప్రయాణం.
" అంతర్ముఖం " లో....
ప్రపంచాన్ని తిట్టుకుంటూ
బ్రతకడం కాదు...
అంతర్ముఖమంటే
కళ్లు మూసుకోవడం కాదు
లోపలికి తొంగి చూసి,
" నేనెవరు నా ధర్మం ఏమిటి "
అని ప్రశ్నించుకునే ఆధ్యాత్మిక ధైర్యం.
బాహ్య గోలను దాటి లోపలి
సత్యాన్ని చూసే సాహసం.
ఇనాక్ గారు కవిత్వంతో
ఫిలాసఫీ చెప్పారు.
బాహ్య సంఘర్షణ కన్నా
అంతరంగ శుద్ధి...
గొప్పదని గుర్తు చేశారు.
అక్షరాలకు ఆచార్యుడై....
విలువలకు ఆదర్శమై....
తెలుగు తల్లికి తలమానికమైన.....
గురువర్యా ! కొలకలూరి...
మీ కలము నుండి.........
ఇంకెన్నో మణిమయ కావ్యాలు
జాలువారాలని, తెలుగు సాహిత్యాన్ని
సుసంపన్నం చేయాలని కోరుకుంటూ...
కొలకలూరి మహా కవి 88వ పుట్టినరోజు .... శుభాకాంక్షలు
కవి రాజు పుట్టిన వేడుకలా లేదిది !
తరతరాల తెలుగు వెలుగు
సాహిత్య ఉత్సవములా ఉంది.
===============================
" కావ్యసుధ "
''వాజ్ఞ్మయ భూషణ''
''ఆధ్యాత్మిక సాహిత్య సామ్రాట్ ''
"ఆధ్యాత్మిక సాహితీ వ్యాస భూషణ్ "
9247313488 : హైదరాబాదు
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి