సామెత -304:-ఇచ్చి తిరిగేది కోమటి-తీసుకొని తిప్పేది అవుసలి
**
గా కోంటోళ్ల కోటయ్య మావఁని సూత్తుంటే మస్తు ఇదనిపిచ్చిందవ్వా! పాపం మా తానికొచ్చి గోడెల్లబోసుకుండు."గీ దినాల్ల మంచితనం అస్సలు బనికిరాదు తల్లీ!" అన్నడు.గా పెద్దాయిన్ని గట్ల బాదవెట్టుడు ఏవన్న బావుంటదా? నువ్వే శెప్పవ్వా!"
"అవును శెల్లే!గా కోటయ్య మావఁ శానా మంచోడు. మనస్మంటి రైతులకి,కూలినాలి శేసుకునేటోళ్ళకి లేదన్కుంట ఉద్దెర వెడ్తడు.ఒక్కత్యేప సుత యిసుక్కోలే. కస్రుకోలే.నెమ్మదిగనే ఇద్దుర్తీ అనే మడిషి.గస్మంటాయిన్ని ఎవలు బాద వెట్టిర్రు శెల్లే? "
"ఇంకెవలు అవ్వా! మనింటెన్కాల మారయ్య బావోళ్ళు పదేల రూపాయిల సౌదలు,సామాన్లు ఉద్దెరకి కొంటబోయిండ్రంట. ఎప్పుడడిగినా రేపిత్త మాపిత్తనని అన్కుంట తిప్పిత్తుర్రంట.పాపం మావఁ శెప్పులర్గేల తిర్గతున్నని శెప్పలేక శెప్ప లేక శెప్పిండు.గట్ల జేసుడేమన్న లాయికేనా శెప్పు.గా మావఁ ఎంతిదైతున్నడవ్వా! గాయిన పిల్లలు నీ అతి మంచితనమే గింతకాడికి తెచ్చిందని నిత్తెం వద్దిత్తున్నరటవ్వా!"
"అయ్యో!యింటుంటెనే కండ్లల్ల నీళ్ళు వొత్తున్నయి శెల్లే.గాయినలెక్క గాయిన పిల్లలు ఎట్లుంటరు. మార్తున్న కాలం సూత్తుర్రు గద! ఉద్దెర తీస్కున్నోళ్ళకు సోయి వుండొద్దా! ఎంటనే తీర్సాలని.గంత మంచోన్ని ఏడిపియ్యొద్దు. తిప్పియ్యొద్దు .గందుకే పెద్దోళ్ళు ఊకెనే అన్లే శెల్లే "ఇచ్చి తిర్గేది కోమటి -తీసుకొని తిప్పేది అవుసలి" అని .ఎన్కటోళ్ళు అనుబగించి శెప్పిర్రు గీ సామెతని."
"అవునా అవ్వా! నువ్వు శెప్పింది గిప్పుడు సుబూదిగ నిజవేఁ అనిపిత్తుంది. గందుకే కొన్ని దుకణాలోళ్ళు 'ఉద్దెరివ్వబడదు' అని అట్టముక్క మీద రాశి ఏలాడదీసింది సూశిన.గిందుకే కావచ్చు."
"అవును.గాళ్ళు మాత్తరం ఏం జేత్తరు శెప్పు.మంచితనానికి రోజుల్లేవు శెల్లే."
"అవ్వా!ఇచ్చి తిరిగేది కోమటి అన్నవు బాగనే ఉంది గని "తీసుకొని తిప్పేది అవుసలి" అన్నవెందుకు గాళ్ళేం జేసిండ్రు అవ్వా! గంత మాట వడ్తుర్రు."
"శెల్లే! ఒక్కలు జేసినా, ఇద్దరు జేసినా ఇంగ అందర్కి పుల్మి మాట్లాడుడు లోకంల శానామట్టుకు ఉన్నదే గద. గట్లనే బంగారప్పని సేశే అవుసలి ఆయన ఒక్కో వత్తువు శెయ్యాలంటే కళ్ళల్ల వొత్తులేస్కొని అన్న తీర్గ నగలు, అందంగ సూడ సక్కదనంగ జెయ్యాల.గా పని జెయ్యడాన్కి శానా కట్టముంటది. శానా సయిమం బడ్తది.గందుకనే ఇత్తనన్న సయిమానికి యియ్యరు. అసలే బంగారం కరీదు గల్లదాయె.ఏలు,లచ్చలతో పని.గాళ్ళు శేయిచ్చుకుంటున్న నగ శేతికొచ్చేదనుక అవుసలాయిన ఇంటి సుట్టు తిర్గుతనే ఉంటరు.గందుకే పెద్దోళ్ళు గీ మాట గా మాట కల్పి సామెతగ శెప్పిర్రు శెల్లే !"
"నిజమేనవ్వోవ్! మొన్నీ నడ్మల శెవుల కమ్మలు శేయమని అవుసులోల్ల రామాశారి మావఁకి ఇచ్చిన.ఆరం దినాల ఆటెంక రమ్మంటే మన్సేడాగుద్ది. మూడు దినాల సంది అయ్యిందా మావాఁ అన్కుంట తిర్గుతనే ఉన్నవ్వా!''
"అగ్గో! సూశినవా శెల్లే ! అస్లిష్యాలు గిట్లుంటయి గాబట్టే గిస్మంటి సామెత జనాల్లోకొచ్చింది."
"గదండీ సంగతి! "ఇచ్చి తిరిగేది కోమటి -తీసుకొని తిప్పేది అవుసలి'' అంటే గిదే మరి. గాళ్ళ బాద అర్తం శేస్కొని తిప్పిచ్చుడు,తిరుగుడు శెయ్యొద్దు అవ్వా.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి