సుప్రభాత : కవిత - బృంద

 

చిన్ని తరగల ఊయలలో 
ఎన్ని బుడగల పయనమో 
ఎంత దూరపు బంధమో 
ఎంత కాలపు స్నేహమో!

తిరిగి చూసే తీరిక లేదు 
నిలిచి వేచే కోరిక లేదు 
పిలిచి పిలిచినా ఆగలేక 
తలచుకోమని తరలే కాలం!

సాగిన కొద్దీ పెరిగే దూరం 
ఆగిన మాత్రం అందేనా...
మూగిన తలపుల దొంతరలో 
రేగిన వేదన తెలిసేనా!

బంధాలకు బందీలుగా 
మమతలనే  మాయలో 
సతమతమవుతూ...
సహనపు హద్దులు చూస్తూ...

బదులు లేని ప్రశ్నలతో 
అర్థం కాని పరీక్షలతో 
అలసి అడలి పోయేదే 
అంతిమతీర్పు అయితే..

ఆశ ఒక్కటే ఆధారం 
రేపు మాత్రమే సమాధానం 
వెలుగు కోరే చీకటికి 
వేకువ ఒకటే విజయం 

🌸🌸సుప్రభాతం 🌸🌸

కామెంట్‌లు