రామలక్ష్మణులు యమునానది తీరమును దాటుట : - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట


ఆ మహార్షి ఆశ్రమమునకు తిరిగివెళ్లెను 
ఓ లక్ష్మణా! మనపై ఆ మహర్షి కృప జూపెను 
సీతారామలక్ష్మణులు నదితీరమునకు చేరిరి
ఈ నాదిని దాటుట యెట్లా? అని ఆలోచించి 

రామలక్ష్మణులు ఎండిన వెదురుకర్రలను తెచ్చి 
ఒక పెద్ద తెప్పను సిద్ధము చేసినారు 
లక్ష్మణుడు సీతాదేవి కొరకై  
చక్కని ఆసనమును ఏర్పాటు చేసినాడు

ఆ తెప్పను ఎక్కి వారు నదితీరమును దాటినారు 
మర్రి చెట్టు వద్దకు వారు చేరినారు 
సీతాదేవి ఆ వృక్షమును ప్రార్థించి
రామలక్ష్మణులతో కలిసి ముందుకు నడిచినది 

వారు సుందర ప్రదేశమున విహరించి
అనంతరము యమునా నది తీరమున 
ఒక సమతల ప్రదేశమునకు చేరి 
సీతారామ లక్ష్మణులు అచట నివసించిరి. 
===================================
అయోధ్యకాండమునందు 55వ సర్గ సమాప్తము 🙏🏻
కామెంట్‌లు