1990ల ప్రారంభంలో జర్మనీ మహిళల కోసం "Frauenparkplätze" పేరుతో ప్రత్యేక పార్కింగ్ స్థలం తెచ్చింది. పట్టణ ప్రణాళిక, భద్రతా మనస్తత్వశాస్త్రం, ఆస్తి చట్టాలు కలిపి ఒక ముఖ్యమైన ప్రయత్నంగా ఇది ప్రారంభించడమైంది.
ఆ రోజుల్లో చీకటిగా, ఒంటరిగా ఉండే బహుళ అంతస్తుల పార్కింగ్ ప్రదేశాల్లో మహిళలపై దాడులు, వేధింపులు ఎక్కువయ్యాయి. అలాంటి నేరాలను తగ్గించడమే ఈ ప్రత్యేక పార్కింగ్ స్థలాల ముఖ్య ఉద్దేశం.
ఈ పార్కింగ్ స్థలాలను సెక్యూరిటీ రూమ్లు, లిఫ్ట్లు, బయటకు వెళ్లే దారుల వద్ద ఏర్పాటు చేశారు. వీటిని ఎక్కువ వెలుతురు, CCTV కెమెరాలు, జనం నడిచే ప్రదేశాల్లో సిద్ధం చేశారు.
మహిళలు తమ వాహనాల నుంచి అనుకున్న ప్రదేశానికి వేగంగా, సురక్షితంగా వెళ్లడమే పట్టణ ప్రణాళికా నిపుణుల ముఖ్య లక్ష్యం.

addComments
కామెంట్ను పోస్ట్ చేయండి