వివిధ దేశాల్లో వింతకథలు!: - అచ్యుతునిరాజ్యశ్రీ


 జపాన్ లో ఓబెస్తవాడి వలలో తాబేలు చిక్కింది.దాన్ని విడిచిపెట్టగానే అది  అతన్ని డ్రాగన్ రాజ్యంకి తీసుకెళ్లింది.
అక్కడ అతనికి ఓఅపూర్వ రాకుమారి పరిచయంకల్గింది.కొన్ని గంటలు మాత్రమే మాట్లాడి తిరిగి భూమిపైకి వచ్చేప్పటికికొన్ని శతాబ్దాలు గడిచాయి.అతనికి తెల్సినవారంతా చనిపోయారు.రాకుమారి ఇచ్చిన డబ్బా తెరిచాడు. అంతే వృద్ధునిగా మారి చనిపోయాడు.ఐర్లాండ్ కథకూడా ఇలాంటిదే! ఓషీన్ అనే ఓవీరుడు ఓరాజ్యానికెళ్లాడు.అక్కడ జనం ఎప్పుడూ యవ్వనంలోనే ఉంటారు.అక్కడ కొన్నాళ్లుండిభూమిపైకి వచ్చేటప్పటికి అంతాపూర్తిగా మారిపోయింది.ఎన్నో శతాబ్దులు గడిచాయి.ఐర్లాండ్ లో క్రైస్తవ మత వ్యాప్తిఐంది.గుర్రం దిగొద్దని హెచ్చరిక చేసినా అతనువినలేదు.అంతే వృద్ధుడైనాడు. ఇలా టైంట్రావెల్ కథలు ప్రపంచంలో చాల ఉన్నాయి.రైవతుడనే రాజుకూతురు పెళ్లికోసం బ్రహ్మ లోకం వెళ్లాడు.తిరిగి వచ్చేటప్పటికి ఎన్నో సంవత్సరాలు గడిచి,పొట్టి జనాలు కనబడ్డారు.ఇంకో కధనం ఏమంటే ఇంద్రద్యుమ్నుడు బ్రహ్మ ని భూలోకంకి వెళ్లాడు.కానీ లక్షలాది సంవత్సరాలు గడిచాయి.హిమాచల్ ప్రాంత  జానపద గాథల్లో టైంట్రావెల్ ప్రస్తావన ఉంది.
కామెంట్‌లు