అంబర్ పేట లోని జి జి హెచ్ ఎస్ గోషామహల్ పాఠశాలలో ఇటీవల స్కూల్ క్యాబినెట్ కు సంబంధించిన ఎన్నికలు పార్లమెంట్ కు జరిగే ఎన్నికల విధానంలోనే నిర్వహించారు. ఈ ఎన్నికలు మధ్యాహ్నము రెండు గంటల నుండి 3 - 30 గంటల వరకు జరిగాయి. 6 నుండి 10వ తరగతి విద్యార్థులు అందరూ వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పాఠశాల హెడ్ బాయ్ , హెడ్ గర్ల్, డిప్యూటీ హెడ్ బాయ్, డిప్యూటీ హెడ్ గర్ల్ కొరకు ఎన్నికలు జరిగినట్లు పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు, పాఠశాల ఎన్నికల కమీష్నర్ రూప తెలిపినారు. ఈ ఎన్నికలను సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు వర్జిని, ఆసిఫా లు ఎన్నికల అడ్మినిస్ట్రేటర్స్ గా నిర్వహించారు .
ఎన్నికలలో పిఓ షిఫా , ఏపీఓ శివాని యాదవ్ ఓపీఓ సోనాలి, దస్తగిరి , తేజశ్రీ తరుణి , పోలింగ్ ఏజెంట్లు, భద్రత సిబ్బంది అందరూ పాఠశాల పిల్లలే కావడం విశేషం . . మైక్రో అబ్జర్వర్ గా మాధురి టీచర్ ప్రశాంతంగా జరిగేలా చూసారు. ఎన్నికల లెక్కింపు శనివారం జరిగింది. ఎమ్. డి. అర్బాజ్ హెడ్ బాయ్, జి.హేమశ్రీ హెడ్ గర్ల్, పి. అక్షరాణి డిప్యూటీ హెడ్ గర్ల్, డిప్యూటీ హెడ్ బాయ్ ఎన్. సురేశ్ లు ఎన్నికైనట్లు చీఫ్ కౌటింగ్ ఆఫిసర్ శ్రీమాన్ జై ( 9వ తరగతి ) ప్రకటించారు. కౌటింగ్ ను కూడా విద్యార్థులే నిర్వహించారు. కౌటింగ్ సూపర్ వైసర్ గా మరియం, అసిస్టెంట్ సూపర్ వైసర్ గా ఆలియా ముస్కాన్ , అదర్ కౌటింగ్ ఆఫిసర్స్ గా నదీమ్, జోయ సుల్తాన, వి. అక్షయ, శిరీన్ ఫాతిమ లు వ్యవహరించారు. గుప్త సర్ ఎన్నికల మెటీరియల్ ఇంచార్జ్ గా ఉన్నారు. అన్నపూర్ణ, శరత్ బాబు ల పర్యవేక్షణలో ప్రశాంతంగా జరిగాయి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి