పునర్జన్మ నెత్తి పుడమిపైకి
తెచ్చిన మాతృమూర్తి వీక్షణము అమృతమయమే.
అమ్మ చూపు చల్లనిది
పసిడిబొమ్మలా తయారుచేసి
పరుల దృష్టి పడక బుగ్గన దిష్టి చుక్క
పెట్టి పరవశించే తల్లి
పరదేవతా స్వరూపమే..!!
నీ ఉన్నతికై అల్లరిచేసిపుడు
తండ్రి కోపముతో చూసిన చూపు,
నైతిక విలువల ను నేర్పి సమాజంలో ఆదర్శవంతునిగా
తీర్చిదిద్దిన సద్గురు వీక్షణము జీవితాన మరువలేము....!!
ఆర్తితో వచ్చు భక్తులపై
ఇంద్రాద్రి పై వెలిసిన కనకదుర్గమ్మ.
సప్తగిరులపై కొలువైన
వేంకటేశ్వరుని కరుణా కటాక్ష వీక్షణాలు
లోకాన జగద్వితమే కదా...!!
రామసేతు నిర్మాణం లో
శ్రీరామచంద్రుని తీక్షణ వీక్షణానికి తలొగ్గిన సముద్రుడు.
ప్రేమతత్వమే ముముక్షత్వమని సమ్మోహన వీక్షణమూర్తి
శ్రీకృష్ణ పరమాత్మ.
మీరజాలగలడాయని
తన కంటితోనే భర్తనే శాసించిన సత్యభామ..!!
విహంగ వీక్షణము తో
సాహితీ విశ్లేషణ చేసే సాహితీకారులు
నవరసాలను కనులతోనే పలికించ వచ్చని
తెలియచేసే నటరాజ వారసులం
జీవితసాఫల్యత కు సోపానమే వీక్షణమన్నది అక్షర సత్యం......!!
----------------------------------------
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి