వారు ఆవలి తీరము చేరి వత్సదేశమున ప్రవేశించుట :-ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట


శుభలక్షణములు గల ఓ తమ్ముడా! 
ఈ వనమున మనము పరస్పరము 
రక్షించుకొనుచుండుట వలన 
క్లిష్టపరిస్థితులు ఏవియు ఎదురు కాలేదు 

ఇకముందు ఏ పరిస్థితులు ఎదురవునో 
సీతాదేవి వనవాసము ఎలా యుండునో 
ఇచ్చట జనసంచారము ఉండదు 
పంట పొలములే కనబడవు 

ఉద్యానవనములు కూడా యుండవు
దారులు ఎగుడు దిగుడుగా నుండును 
ప్రమాదకరమైన గుంతలు యుండును 
నేటి నుండి ఈ అడవిలో సీత నడవబోతుంది 

శ్రీరాముడు గంగానదిలో వెళ్తుంటే
సుమంత్రుడు రెప్పలార్పక చూచుచుండెను
శ్రీరాముడు గంగానదిని దాటి క్రమముగా 
వత్సరాజ్యప్రదేశములోని  ప్రయాగను ప్రవేశించును 

రామలక్ష్మణులు ఇరువురును 
ఆ వనములలో క్షత్రియ ధర్మమును అనుసరించి 
ఆశ్రమ వాసులకు హాని గూర్చినట్టి 
మృగములను వేటాడి సీతతో గూడి చెట్టునీడకు చేరినారు 
======================================
అయోధ్య కాండము నందు 52వ సర్గ సమాప్తము 🙏🏻
కామెంట్‌లు