చెప్పండి... : - గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.


మీరంతా ఎందుకో... కవిసమ్మేళనాల్లో పాల్గొంటుంది,
కవితలను పఠిస్తుంది,
కవిత్వం కోసం పాటుపడుతుంది,
కలల సాకారంకోసం ప్రయత్నిస్తుంది॥

మీరంతా ఎందుకో... పదాలు కూర్చుతుంది,
పంక్తులు పేర్చుతుంది,
ప్రాసలు వాడుతుంది,
ప్రశంసలు అందుకుంటుంది॥

మీరంతా ఎందుకో... భావాలు పండిస్తుంది,
భావుకులను అలరిస్తుంది,
అక్షరాలను ఆరాధిస్తుంది,
అభినందనలు పొందుతుంది॥

మీరంతా ఎందుకో...  కవితలు చదువుతుంది,
చదివిస్తుంది,
చింతిస్తుంది,
చైతన్యాన్ని పంచుతుంది॥

మీరంతా ఎందుకో... వినమ్రంగా వింటుంది,
వినిపిస్తుంది,
విమర్శలను స్వీకరిస్తుంది,
విజయాలను సాధిస్తుంది॥

మీరంతా ఎందుకో... కమ్మని కలలు కంటుంది,
కల్పనలు చేస్తుంది,
కవితలను సృష్టిస్తుంది,
కళామాతను కొలుస్తుంది॥

మీరంతా ఎందుకో... రమ్యంగా రాస్తుంది,
రంజింపజేస్తుంది,
రసహృదయాలను తాకుతుంది,
రచయితగా రాణిస్తుంది॥

మీరంతా ఎందుకో... నైపుణ్యం నేర్చుకుంటుంది,
నేర్పిస్తుంది,
నవభావాలను నింపుతుంది,
నలుదిశలా పేరు తెచ్చుకుంటుంది॥

మీకంతా... కవిత్వం కాంక్షా,
అక్షరాలు అలంకారాలా;
పదాలు ప్రియ నేస్తాలా,
సాహిత్యము సరస్వతీదేవి వరమా॥

అందుకేనా మీరు... పదాలు కూర్చేది హృదయాలను కలపడానికా,
పంక్తులు పేర్చేది పరిమళాలను పంచడానికా;
ప్రాసలు వాడేది కవితలకు సొగసులు అద్దడానికా,
భావాలు రాసేది మానవత్వాన్ని నిలబెట్టడానికా॥

కామెంట్‌లు