ఉదయమెందుకో
బద్దకంగా ఆవలించింది
సవరించాల్సిన నోట్‌బుక్స్
బోధనా ప్రణాళికల’లా
పూర్తిచేయాల్సిన పనుల జాబితా
ఎదురుగా నోరెళ్లబెట్టుక కూర్చుంది
మనసు మూలల్లో
అలసట శబ్ద తరంగాలు
మళ్లీ అదే పాఠాల గోలా!
రొటీన్ అంటూ గొడవేస్తాయి
అయినా మనసు తరగతి గది
వైపు అడుగులు వేయమంది!
విద్యార్థులను
చైతన్యపరచడానికి
జ్ఞానదీపం వెలిగించే
సంకల్ప ప్రేరణలా
జ్ఞాన రాజ్యంపై
దండయాత్రకు పురికొల్పింది!
పాఠాల సారాంశాన్ని
విద్యాబోధనై
నిలువెల్లా నింపుకున్నా
భవిష్యత్తును తీర్చిదిద్దడానికి
సిద్ధమైన దేహం
తరగతి గది సవాళ్లను
అందుకుంటూనే ఉంటుంది

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి