నీ మనసునే అడుగు!: - డా పివిఎల్ సుబ్బారావు.- విజయనగరం.


మనిషి మనసే, సంకల్పమూలం!
సంకల్పబలం జయరధఇంధనం!
హనుమసంకల్పం లంకాదహనం!
ధర్మపక్షఎంపిక పాండవవిజయం!

విద్యార్థి విజయం, శ్రద్ధే ప్రథమం! 
శ్రద్దావాన్ లభతే జ్ఞానం, నిశ్చితం! 
అలుపెరుగని యత్నం,అవసరం!
అలసిపోతే,అడుగేపడదు నిజం!

వృత్తి విజయం ఏకాగ్రత మూలం!
 ప్రవృత్తితోడైతే నీదే ప్రథమస్థానం!  
 గెలుపు,నిలిపేది, అంకితభావం !
అంకితభావమే,విజయరహస్యం!

సైన్యం, తొలి అడుగు క్రమశిక్షణ! 
అదే పోరాటాన, స్వీయ రక్షణ!  
 ఆపరేషన్ సిందూర్, ఉదాహరణ!
 కార్గిల్ విజయం, నిత్యం, స్మరణ!

జీవనవిజయం, తొలిమెట్టు, సేవ! 
ఒక్కోమెట్టు,ఎక్కు,సార్థకత త్రోవ!
సేవఒక్కటే,సదాదైవం,నినుబ్రోవ!
సేవే జీవనం, వద్దు, మరో యావ!
__________
కామెంట్‌లు