బాల్యంలో నే పుట్టిన వెంటనే
శ్రీరాముని దరి చేరిన
మాతృమూర్తినిచూసి
నానమ్మ తాతయ్యలు చివరికి కన్నతండ్రి కూడా
తల్లిని మింగిన నష్టజాతకురాలు అంటే
అమ్మమ్మ తానే అన్ని అయి పెంచి
ఎవరేమన్నా పట్టించుకోకు
చదువుకుంటే సంస్కారం కలిగి
ఉన్నతంగా ఎదుగుతావు అంటే
చదువే ధ్యేయంగా అమ్మమ్మ పడిన కష్టాన్ని చూసి
పెద్దయ్యాక జాగ్రత్తగా అమ్మమ్మని చూడాలనుకున్నా
ఉద్యోగం వచ్చి అమ్మమ్మతో చెప్పిన మరునాడు
అమ్మ చెంతకు అమ్మమ్మ చేరిన వేళ
కన్నీళ్లను ఆపుకోలేక
భగవంతుని పై నమ్మకం కోల్పోయాను
నా ఉద్యోగం మంచితనం చూసి
నాతో పని చేసే ఆనందు వివాహాం చేసుకుంటానంటే
ఎంతో పొంగిపోయాను.
ఇద్దరు పిల్లలకు తల్లినై ఆనందంగా గడిపిన వేళ
ఆక్సిడెంట్ లో ఆనంద్ అర్ధాంతరంగా మరణిస్తే
స్థితప్రజ్ఞతకు దర్పణంగా
పిల్లలను కష్టపడి పెంచి
ఏ లోటు లేకుండా ఉన్నతంగా ఎదిగిన తరువాత
రెక్కలు వచ్చి స్వతంత్రంగా వివాహాలు చేసుకుని పిల్లలు వెళితే
జీవితం ఇంతే అని కన్నీటి చారలు కనపడకుండా
వృద్ధాశ్రమంలో గడుపుతు
కష్టాలు లేక కన్నీరు పెట్టని మనిషి
కర్మయోగియే అని
ఎనిమిది పదుల వయస్సులో అనుకున్నాను!!
.........................
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి