చిగురుల బోలి బహు
సున్నితమ్ము.ఎన్ని జన్మల పున్నేమో
మా ఇంట రెండు తోటలు మానుగా
వృద్ధి జెంది ఎనలేని సంతృప్తినిచ్చే.
మా ఇల్లు నిండే పూ బోణులతో
మాతోట
నవ్వే పూ బాలలతో
ప్రత్యూష రుక్కులతో రెక్కలను విప్పిన
పూ బాలలు పిలిచి చెప్పే పువ్వు బోణులకు
"మమ్ము చేర్చుడి ప్రభు పాదముల
చెంత ననగా "అమ్మా వద్దు."
దయలేనివారు ఈ ఆడువారు" అని
తిట్టిరి మున్ను పాపయ్యశాస్త్రి"అనిరి
పూబోణులంతా.
పూవులు నవ్వి "కవులు
కఠినులు కారు అందుకే పాపయ్యను '
కరుణశ్రీ అన్నారు.మిరు రండు
చేర్చుడు మమ్ము దైవ పాదములయందు,
ముడుచు కొనుడు మీ ముడుల యందు.
మాజన్మ ధన్యమగును.
ఇచ్చటనే వాడి రాలిన
నెమీ ఫలము" ?అనుచు బల్కిన,
ఆ. లతాంగులు, లతాంతములను
ప్రేమగా సృజించి తెచ్చిరి ప్రభు పాదముల కడకు.
అత్తలు ,కోడళ్ళు, ఆడబడుచులు
చుట్టములతో నిండిన మా ఇంట పండుగ
నిండుగా నవ్వుచు నుండ,
పూజించిరి పురుషులు పురుషోత్తముని.
నైవేద్యములందించి
తరించిరి తరుణులంతా.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి