భలే భలే పనసపండు! అచ్యుతునిరాజ్యశ్రీ
 

మామిడిపండు తర్వాత ఘుమఘుమ లాడే పసుపుపచ్చ తొనలతో నోరూరించేది పనసపండు.తండ్రిగరగర తల్లిపీచుపీచు, బిడ్డలు రత్నమాణిక్యాలు అనే పొడుపుకథ విన్నారుకదా? ఆంగ్లంలో జాక్ ఫ్రూట్ అంటారు.పచ్చికాయతో  పనసపొట్టుకూర చేస్తారు.పండువి తింటాం  .వృక్షశాస్త్రప్రకారం, పనస పండు అనేది సత్యం.ఇందులో గింజలుంటాయి.ఉడకేసి తింటారు.చెట్టుకింద పూలుంటాయి. పచ్చి కాయని కూర అనే అంటారు.భారత్,బంగ్లాదేశ్,శ్రీలంక, దక్షిణాసియాదేశాల్లో పచ్చికాయలు కూరగాయల వండుతారు. అనాస పండులాగా పై తొక్క బాగా తీసేసి తీయని పసుపు తొనలు తినాలి  .90సెం.మీ.పొడవు 36 కెజి ల బరువు ఉండే ఫలం ఇది.బంగ్లాదేశ్ జాతీయ పండు పనసపండు.దాదాపు 6వేల ఏళ్ల క్రితంది ఈచెట్టు. 🌹
కామెంట్‌లు
Popular posts