నమ్మకం....!!: -డా ప్రతాప్ కౌటిళ్యా.


ప్రార్థించడాన్ని 
మనసంటాం.!

స్తుతించడాన్నీ
పాటంటాం...!!

మంత్రించడాన్ని 
మాట అంటాం..!!

ఆకర్షించటాన్ని 
వశీకరణ మంటాం.!!

దీంట్లో వ్యాపారం లేదు 
వ్యవహారం లేదు 
దీంట్లో  నటన లేదు 
నాటకం లేదు........!

దీన్ని కేవలం 
దేవుని ముందు 
ప్రేయసి ముందు 
మాత్రమే ప్రదర్శిస్తాం.!!

ఇది కేవలం స్వచ్ఛమైన భక్తి 
పవిత్రమైన ప్రేమ మాత్రమే..
దీంట్లో 
గెలుపు ఓటములు ఉండవు. 

కేవలం- భక్తిని- ప్రేమను -పొందుతాం 
అన్న నమ్మకం ఉంటుంది.......!!
==========================================
డా ప్రతాప్ కౌటిళ్యా పాలెం నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం శ్రీ శ్రీ కళావేదిక గౌరవాధ్యక్షుడు
కామెంట్‌లు