ఉన్నవ సోదరులు వెంకట్రామయ్య,రాజగోపాలకృష్ణయ్యగార్లు ఓవిధంగా మరుగున పడిన మహనీయులనే చెప్పొచ్చు.సంఘాలపంతులుగా తెలంగాణ జనాలకి పరిమితులు.1981 నవంబర్ 5న హైద్రాబాద్ లో కన్నుమూసిన వెంకటరామయ్యగారు,1930లో ఆంధ్ర మహాసభ తొలిసమావేశాలు జోగిపేటలో జరగటంలో ప్రధాన పాత్ర పోషించారు.16జులై 1896లో ఉన్నవ (గుంటూరు) లో పుట్టారు.ఆరుట్లకి చెందిన గోవిందరాయుడితో పరిచయంతో నెలకి 10రూపాయల జీతంతో ఆయన పిల్లల కి ట్యూషన్ మాష్టారుగా పనిచేశారు.హిందీభాష వ్యాప్తికి కృషిచేశారు.సంగారెడ్డిలో ఉర్దూస్పెషల్ ఎగ్జామ్ పాసైనారు.పాముమంత్రం నేర్చుకొన్నారు.పశువుల గాలికుంటువ్యాధికి చికిత్స చేసేవారు.గోలకొండపత్రిక మేనేజరు పదవివదిలేసి, ఉన్నవలో అన్నచనిపోటంతో,ఆయన 6గురు పిల్లల్ని,తల్లి,వదినె,భార్య పిల్లల్ని పోషించారు.వ్యవసాయం చేస్తూ,లైబ్రరీ పెట్టి(హనుమన్నిలయం) గణపతినవరాత్రి ఉత్సవాలు వయోజనబడి నడిపారు.భార్య సుగుణమ్మ సహకారం తో చేశారు.తమపొలంలో పండిన పత్తితో నూలువడికి వస్త్రాలు నేయించేవారు. పొలంలో పండిన జొన్నలతో పగలు,రాత్రిపరిగె అన్నంతో కుటుంబం గడిపింది.గోల్కొండ పత్రిక నిజాంనిరంకుశత్వాన్ని ఎండగట్టింది.ఆపద వస్తుందనే భయం జనాల్లో ఉండేది.ఉన్నవ వారు దాదాపు ఉచితంగా మూడున్నర ఏళ్లు మేనేజర్గా సేవ లందించారు.ఇక ఆంధ్రోద్యమ ప్రచారంచేస్తున్న వెంకటరామయ్యగారిపై నిజాంప్రభుత్వ నిఘా ఉండేది.అందుకే ఆయన్ని మన్ననూర్ పంపుతామని బెదిరించేది. ఇది మహబూబ్నగర్ లోని అమరాబాద్ కొండప్రాంతం.ఎన్నో గ్రంథాలయాలని స్థాపించి అవి సక్రమంగా నడుస్తున్నాయో లేదో నని అజమాయిషీ చేసేవారాయన!వర్తకసంఘాలు ఏర్పాట్లలో ఆయన కృషి అమోఘం.వరంగల్ నల్గొండ, మహబూబ్ నగర్,మెదక్ జిల్లాల్లో పర్యటించిన ఉన్నవ ఓప్రక్క నిజాంరాష్ట్రాంధ్రమహాసభల్లో తలమునకలై ఉండికూడా వర్తక రైతుసంఘోద్యమాలకై ఆయన చేసిన కృషి నేడు కనుమరుగైంది.40దాకా స్త్రీల పునర్వివాహాలకు(బాలవితంతువులు) అనుసంధానకర్త గాఉన్న ఉన్నవ వారు నిజాంరాష్ట్ర ఆంధ్ర మహాసభల రూపశిల్పిగా ఆనాడు ప్రసిద్ధికెక్కారు.ఉన్నవ వెంకట్రామయ్య గారు 16జులై 1896 లో గుంటూరు జిల్లాలోని ఉన్నవలో సామాన్య బ్రాహ్మణ రైతుకు పుట్టారు.అమ్మ నాన్నలు మహాలక్ష్మమ్మ, సుబ్బారాయుడు. 7గురు సంతానంలో ఆయన 3వవారు.ఆయన పదోఏట తండ్రి చనిపోటం,మున్సిఫ్ పరీక్ష, గ్రామ కరణం ఎకౌంట్స్ పరీక్షలు పాసైనారు.మాధవమ్మ ,ఆయన బావగారు కూతురితో పెళ్లి ,ఆమె చనిపోటంతో సుగుణను పెళ్లాడటం జరిగింది.విధి విలాసం వేరేగా ఉంది.రంగారెడ్డి జిల్లా ఆరుట్లగ్రామానికి చెందిన వింజమూరి గోవిందరావు అనే ఆయన తో రైలులో పరిచయం ఉన్నవ వారి జీవితాన్ని మలుపు తిప్పింది. ఆయన పిల్లలకి ట్యూషన్ చెప్పడంకోసం ఆరుట్లలో నెలకి 10రూపాయల జీతం ,భోజనంపెట్టడం,తో కొత్త జీవితం ఆరంభించారు.అలాతెలంగాణా లో స్థిర పడ్డారు.అప్పటికాయనవయసు 20ఏళ్లు.ఆరుట్ల జాగీరులో తెలంగాణ వీరేశలింగంగా పేరుగాంచిన ఆయన మనకు స్ఫూర్తిదాత 🌷
ఉన్నవ వెంకటరామయ్య: - సేకరణ...అచ్యుతునిరాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి