చింతగింజల చిత్ర: - డా.. కందేపి రాణీప్రసాద్
 

హలో పిల్లలూ! నేను చింతగింజలతో చాలా జంతువుల్ని సృష్టించాను. ఇప్పుడు అమ్మాయిని తయారు చేశాను. చూడండి ఎంత బాగుందో! చక్కని బాబ్డ్ కటింగు, స్కర్టు, బ్లౌజ్ వేసుకుని స్కూలుకు తయారయి వెళుతున్నట్లుంది కదా! మనం కూరల్లో వాడుకునే చింతపండు లో నుంచి వచ్చే చింత గింజల్ని దాచుకున్నాను. వాటితోనే రకరకాల బొమ్మలు తయారు చెస్తున్నాను. నేను చింత చరిత్ర అని ఒక వ్యాసం కూడా రాశాను. ఈ చింతను ‘భారతదేశపు ఖర్జూరం’ అంటారు. ఇది ఫాబేసి కుటుంబానికీ, సిసాల్పినాయిడే ఉపకుటుంబానికి చెందిన చెట్టు. దీని శాస్త్రీయనామం “టామరిండ్ ఇండికా”. చింత చెట్టుకు పుల్లటి చింతకాయలు కాస్తాయి. చింత కాయలు పండిన తర్వాత మెత్తటి చింతపండు తయారవుతుంది. చింత పండును వంటల్లో విరివిగా వాడతారు. చింతచెట్టు మానుతో చెక్క పరికరాలు చేస్తారు. చెట్లు దట్టంగా పెరిగి చల్లని నీడను ఇస్తాయి. ఉష్ణ మండలాల్లో పెరిగే చెట్లు. ఆకులు లేతగా ఉన్నపుడు చింత చిగురు గా పప్పులో వేసి వండుకుంటారు. జ్వరం, వికారాలకు మందుగా వాడతారు. చింతపండు చారు వలన జీర్ణశక్తి పెరిగి కడుపుబ్బురం తగ్గుతుంది. వంద గ్రాముల చింత పండులో 283 కాలరీల శక్తి వస్తుంది. చింతకాయను పచ్చడిగా పెట్టుకుంటారు. చింత పిక్కల్ని పొడి చేసి బిస్కెట్ల తయారీలో వాడతారు. చింత చెట్లను రహదారి కిరువైపులా నీడల కోసం పెంచుతారు. చింత కలపను ఇంటి సామాన్ల తయారీలో ఉపయోగిస్తారు. చాలా వరకు వంట చెరుకుగా ఉపయోగిస్తారు.
చక్కని స్కర్టు, జాకెట్ వేసుకున్న చిత్ర ముచ్చటగా చింత గింజలతో తయారయింది. జుట్టుకు హెయిర్ బ్యాండ్ పెట్టాను. ఇన్ని చింతగింజల్ని సేకరించడానికి చాలా రోజులు పట్టింది. నల్లని చింత గింజలతో అమ్మాయి అందంగా ఉన్నది. బుట్ట చేతుల జాకెట్ వేసుకున్నది. పాప పద్ధతిగా నిలబడింది.
కామెంట్‌లు