'లిటిల్‌ ఫ్రీ లైబ్రరీ’ :- - యామిజాల జగదీశ్




 

 వయసు పైబడి, ఓ ఎండిపోయిన చెట్టు కనిపిస్తే మనమేంచేస్తాం.... కలప కోసమో, వంట చెరకు కోసమో నరికేస్తాం. ఎలాగో చనిపోయింది కనుక ఎవరైనా ఇలాగే ఆలోచిస్తారు. అది సహజం. కానీ ఓ మహిళ అందుకు భిన్నంగా ఆలోచించారు. అదేంటో చూడండి....
ఓ మోడువారిన ఓ చెట్టు విషయమై అమెరికాలోని బోయిస్‌ ప్రాంతానికి ఆర్టిస్టు, లైబ్రేరియన్‌ అయిన షరాలీ ఆర్మిటేజ్‌ సృజనాత్మకంగా ఆలోచించారు. అప్పటికే కొమ్మలన్నీ నేలరాలి, మోడుగా మిగిలిన 110 ఏళ్ల క్రితంనాటి చెట్టును ఓ అందమైన లైబ్రరీగా మార్చేసారు. దానికి ‘లిటిల్‌ ఫ్రీ లైబ్రరీ’ అని పేరు పెట్టారు. నిజానికి ఈ పేరుతోనే ఓ ఎన్జీవో ఉంది. దీనికి 88 దేశాల్లో లైబ్రరీ షేరింగ్‌ నెట్‌వర్క్‌ ఉంది. ఎవరికి ఏ బుక్‌ కావాలన్నా తీసుకోవడం, చదివిన వెంటనే తిరిగి ఇచ్చేయడం ఈ నెట్‌వర్క్‌ ద్వారా జరుగుతున్నాది. ఈ సర్వీస్‌ అంతా ఉచితమే. ఇప్పుడా నెట్‌వర్క్‌ లోనే ఈ చెట్టు లైబ్రరీని చేర్చారు షరాలీ. చెట్టు కాండానికి ఓ డోర్‌ పెట్టారు. లోపల అరలు ఏర్పాటు చేసి పుస్తకాలను అందులో ఉంచారు. 
ఈ చెట్టు లైబ్రరీ ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేయగా లక్ష మందికిపైగా షేర్‌ చేశారు.

కామెంట్‌లు