గ్రామ దేవత ఖండోబా!: -అచ్యుతునిరాజ్యశ్రీ
 

మహారాష్ట్ర లోని జెజూరీ అనేప్రాంతంలో ఖండోబాఆలయంఉంది. పూణెకి సమీపంలో జెజూరీ అనే కొండపై ఈగ్రామదేవత ఖండోబా ఆలయం సామాజిక సాంస్కృతిక వ్యవస్థ కి కేంద్రం.జనాల్ని కలిపే సంఘటిత శక్తి ఆయన కిఉంది.ప్రాచీన కాలంలో ఓవీరయోధుడు హమేషా గుర్రంపై స్వారీ చేస్తూ జనాలని ఆపదలనుంచి కాపాడేవాడు.వివిధ ప్రాంతాల జాతులజనాలు కల్సి కూడేవారు. ఆవీరుడే ఖండోబా శివ,భైరవరూపంలో పూజింపబడేవాడు. ఈయననిగూర్చి రకరకాల కథలున్నాయి.భిన్న భిన్న జాతుల భార్యలున్నవాడు.ఒకభార్య మ్హాలసా వ్యాపార కులానికిచెందినది. కర్ణాటక లింగాయత్ వంశానికి చెందినది.రెండవ భార్య  పశువుల కాపరి పిల్ల బానాయీ. ఇక మిగతావారు దర్జీ,నూనె అమ్మే,తోటమాలి కూతుళ్లు.ఇక బహమనీ బీజాపూర్  సుల్తానుల ప్రభావంతో ముస్లింయువతి ఖండోబా భార్య ఐంది.ప్రతిభార్యకీ ప్రత్యేక  ఆలయం,ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి.వేర్వేరు జాతులు కులాల కన్యలు,అన్నీ వివరింపబడ్ కులదేవతలుగా పూజ లందుకోటం విశేషం!జానపదకథలు గేయాలద్వారా  ఆభార్యలమధ్య వివాదాలు,కలిసిపోవటం, అన్నీ వివరింపబడినాయి.ఎవరికివారే గొప్ప స్వేచ్ఛ, డబ్బున్నదన్న అహం...ఇలా భిన్న ప్రవృత్తులు
ఆనాటి సమాజంలోనే కాదు,నేడు కూడా మనం చూస్తున్నాం. ఎన్ని రకాల భేషజాలు అహం ఉన్నా అంతా ఒక్కటే అనేభావం ఆదైవాన్ని కొలవటంలో కన్పడుతుంది.ఖండోబా పక్కా శాకాహారి.ఇలా కులాల మతాలమధ్యపోరు లేకుండ ఆనాడు వివాహాలతో సంబంధాలు దృఢం చేసుకుని ఐక్యతతో మసిలిన కాలం! అందర్నీ కూడగట్టి ఒకవీరునిగా ఉన్న వాడిని దైవంగా పూజించిన కాలం నాడు🌷
కామెంట్‌లు