నాన్నను పేరు పెట్టి పిలిచే కూతుళ్లకు ఒక రకమైన అందం ఉంటుంది. కూతురిలో తన అమ్మను చూసుకునే నాన్నలు అంతకంటే అందం.
నాన్నకు మేకప్ చేసి మురిసిపోయే కూతుళ్లు ఒక రకమైన అందం. కూతురికి తన చేతులతో ముద్దలు తినిపించి ఆనందించే నాన్నలు అంతకంటే అందం.
నాన్న మెడ పట్టుకుని వేలాడుతూ ఆడుకునే కూతుళ్లు ఒక రకమైన అందం. కూతురి పాదాలను ముద్దాడుతూ మురిపెంగా ఆడుకునే నాన్నలు అంతకంటే అందం.
నాన్న చెప్పే ప్రతి నిజాన్ని ఆసక్తిగా వినే కూతుళ్లు ఒక రకమైన అందం. కూతురు చెప్పే అబద్ధాలను నవ్వుతూ ఆస్వాదించే నాన్నలు అంతకంటే అందం.
నాన్న కోసం దాగుడుమూతలు ఆడుతూ చెట్టు వెనుక దాక్కునే కూతుళ్లు ఒక రకమైన అందం. కూతురిని చూసినా చూడనట్టు ఇంకా వెతుకుతూనే ఉంటే నాన్నలు అంతకంటే ఎక్కువ అందం.
నాన్నను ఒక హీరోలా చూసే కూతుళ్లు ఒక రకమైన అందం. కూతురిని ఒక మహారాణిలా చూసుకునే నాన్నలు అంతకంటే అందం.
నా చేయి వదలవా అంటూ నాన్నను బతిమాలే కూతుళ్లు ఒక రకమైన అందం. ఎవరి కోసమూ కూతురిని వదులుకోని నాన్నలు అంతకంటే ఎక్కువ అందం.
నాన్నకు తన బాధలు చెప్పుకుని ఓదార్పు వెతుక్కునే కూతుళ్లు ఒక రకమైన అందం. కూతురి ముఖం చూడగానే తన బాధలన్నీ మరచిపోయే నాన్నలు అంతకంటే అందం.
వచ్చే జన్మలో కూడా నాన్నకు కూతురిగానే పుట్టాలనుకునే కూతుళ్లు ఒక రకమైన అందం. వచ్చే జన్మలో తన కూతురికే కొడుకై పుట్టాలనుకునే నాన్నలు అంతకంటే అందం.
నాన్న ముందు మగపిల్లాడిలా నటిస్తూ వీరత్వం చూపించే కూతుళ్లు ఒక రకమైన అందం. కూతురి ముందు ఎలాంటి నటన లేకుండా అమ్మలా మారిపోయే నాన్నలు అంతకంటే అందం.
వయసైన నాన్నను తన బిడ్డలా చూసుకునే కూతుళ్లు ఒక రకమైన అందం. వయసు పైబడినా తన కూతురిని చిన్నపిల్లలాగే భావించే నాన్నలు అంతకంటే అందం.
దేవుడు ఇచ్చిన వరం నా తండ్రి అనుకునే కూతుళ్లు ఒక రకమైన అందం. ఆ దేవుడే నా కూతురు అనుకునే నాన్నలు అంతకంటే అందం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి