తెలుగుభాషా సాహిత్యానికి అంతర్జాతీయ వేదికపై మరో అరుదైన గౌరవం
 

తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం (T T A)మహాసభలు-2026 వేడుకల సందర్భంగా నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి కవితా పోటీలలో హైదరాబాద్ కు చెందిన కవయిత్రి ,ప్రభుత్వోన్నత పాఠశాల ఉపాధ్యాయిని శ్రీమతి చంద్రకళ.దీకొండ రచించిన "జర పైలం" అను కవిత ప్రత్యేక ప్రశంసకు అర్హతనొంది, జ్ఞాపిక సంచిక(సావెనీర్)లో ప్రచురితమైనది. ప్రపంచ నలుమూలల నుండి తెలుగు కవులు పాల్గొన్న ఈ పొటీల్లో తెలంగాణ యాసలో వ్రాయబడిన ఈ కవిత సాహిత్య విలువలు,సామాజిక బాధ్యతల సమ్మేళనంగా నిలిచి, న్యాయనిర్ణేతలను ఆకట్టుకుంది. అంతర్జాతీయ స్థాయి  విజయంపై సాహితీమిత్రులు,సహోపాధ్యాయులు మరియు విద్యార్థినీ,విద్యార్థులుహర్షం వ్యక్తం చేసారు.
కామెంట్‌లు