సామెత -295: ఇచ్చేటోన్ని చూస్తే చచ్చేటోడైన లేస్తడట
***
"అవ్వా! నిజ్జంగా మడిషంటే గట్లుండాలె. గీ దినాల్లో గస్మంటి మడిషి కలికమేసి సూశినా కాన్రాడు. గాయిన అమ్మ నాయిన జల్మ సార్తకమైందనుకో."
"అవునా శెల్లే!గంత మంచి మడిషి గీ కలికాలంల సుత మనూల్లె ఉన్నడంటె ఆచ్చిరంగనె ఉంది శెల్లే. గప్పుడెప్పుడో కరోనా సయిమంల మన దేశంల సోనూసూద్ అనే యాకటరు లచ్చలు ,కోట్లు కర్సు జేసిండు. ఎక్కడెక్కడో శిక్కుకున్న వల్స కూలోల్లని గాళ్ళ ఊల్లకి పంపడాన్కి రేల్ గాడీలు ఏపిచ్చిండు.కరోన జబ్బోళ్ళకి ఊపిరి కట్టమైతుందంటే ఆచ్చిజన్ బండల్ని ఇచ్చిండంట,సద్వుకునే పొల్లగాండ్లకి సాయం జేసిండంట.ఎవలికన్న కట్టమొచ్చినప్పుడు గిప్పటికి సుత గాయిన్ని మగానుబావుడు, మడుసుల్ల దేవుడని తల్సుకుంటరు. గింతకీ గాయిన ముచ్చెటి కాదు కదా నువ్వు శెప్పేది?"
"గాయిన ముచ్చెటి గప్పట్ల ఆర్తల్ల బాగొచ్చెగా అవ్వా! గాయినకున్నన్ని కోట్లు ఉన్నోడు మనూల్లె యాడుండవ్వా?గాయినంత గాదు గని గంత మంచి మడిషి మనూల్లె సుత ఉన్నడవ్వా."
"ఎవ్వలు శెల్లే! మనూల్లె గంత మంచి మడిషి. యాదికొత్తనేలేదు."
"గాయినే అవ్వా! మన కోటయ్య తాత కొడుకు కొమురయ్య మావఁ. గీ నడ్మల మనూల్లె పవుతు గాయిన ముచ్చెటినే. గా మద్దెల ఇద్దరు ముగ్గురు రైతుల పొలాలు నీళ్ళు లేక ఎండిపోయినయి సూడు.గాళ్ళకి పొలాల్ల బోర్లు ఏపిచ్చిండంట.నీళ్ళు సక్కంగ పడ్డయంట.గాళ్ళ సంబ్రమంటె సంబ్రం గాదుపో."
"అవు మల్ల! గాయినా? గాయిన కొమురెల్లి మల్లన్నసుమంటోడు.గాయిన్ని మనూరి దేవుడనొచ్చు శెల్లే!"
"అవునవ్వా! గీ వూల్లె మనస్మంటోళ్ళు ఏ కొందరో తప్పిడిసి పతొక్కలు గాయిన సాయం బొందినోళ్ళే.అయితే గీ నడ్మల గాయిన జేసిన సాయం ముచ్చెటి నీకు శెప్దామని వొచ్చినవ్వా!"
"అవునా శెల్లే! గా ముచ్చెటి నాకు తెల్వకనే పాయె.గదేందో జెల్ది శెప్పు శెల్లె.ఆత్రమాగట్లే."
గా సాయం జేసుట్ల శిత్రమేందో తెల్సునా అవ్వా!గాయినంటే అస్సలు పడనోడు గీ నడ్మల పెద్ద బీమారితో సావు బతుకుల్ల ఉన్నడు. ఇంట్లె పైసలన్ని అయిపోయినయ్.కరీదైన వైజ్గం శేత్తె తప్ప బత్కడని తెలిశి వాళ్ళోళ్ళు శేతులెత్తేశిర్రు.అగ్గో గా యిష్యం తెల్శి.గా మడిషికి తనంటే ఇట్టం లేదు గన్క పేరు శెప్పొద్దని పెద్ద దావఖాన్ల శెరీక జేసి వైజ్గం షురూ జేపిచ్చిండు."
ఇంగ ఊల్లోల్లు గా బీమారాయిన బత్కి బట్ట కడ్తడని ఏ కోశానా అన్కలేదు.అన్ని ఆశలొదులుకున్న గాయిన సుట్టాలు పక్కాలు గిది నిజంగనా? కలా? అని ఆచ్చిర పోతుర్రు అవ్వా!"
"గందుకే అంటరు శెల్లే! "ఇచ్చేటోన్ని సూత్తె సచ్చెటోడు సుత లేత్తడని" అంటే గిదే మరి. గా సావు తప్పిచ్చుకున్న మడిషినే సాచ్చం!"
" మరి గిప్పటికైనా తెలుసుకున్నడా గా మడిషి. శత్రుత్తం వున్న సుత సావుబతుకుల్ల ఉన్న తన్ని బతికిచ్చిండని."
"తెల్శిందవ్వా! తెల్శింది. తెల్వంగనే వైజ్గం చేయించుకున్న గా మడిషే తన కొడుకును కోడలును సుత తోల్కోని కొమురయ్య మావఁ ఇంటెకెళ్ళి శేతులు బట్కొని బగ్గ ఏడిశిండటవ్వా! గప్పుడా మావఁ గియ్యన్ని నేను మన్సులోంచి ఎప్పుడో తుడ్పేశిన.నువ్వు సుత తుడ్పేసుకో. నీ మీద నా కెస్మంటి కోపం లేదు.మంచిగుండుమని జెప్పి మందులకు సుత కొన్ని పైసలు శేతుల బెట్టిండంట. సేపులు, దాచ్చలు, దానిమ్మ పండ్లు ఓ బుట్ట నిండ తెప్పిచ్చి గాళ్ళకి ఇచ్చి పంపిండంట అవ్వా! "
గదే శెల్లే! నూటికి గాదు కోటికొక్కలు కొమురయ్య మావఁ అస్మంటోళ్ళు ఉంటరు. "
గదండీ సంగతీ! " ఇచ్చేటోన్ని సూత్తె సచ్చేటోడైన లేస్తడంటే" గిదే మరి. సావుబతుకుల్ల ఉన్న మడిషి,శేతుల పైసల్లేక విలవిల్లాడ్తుంటే,శత్తురువు అని సుత సూడకుండ బతికిచ్చినోన్ని గిట్ల గీ సామెతతో గౌరవిచ్చు కుంటరన్న మాట."

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి