సామెత -294: - ఇచ్చి పుచ్చుకుంటే వ్యవహారం -వచ్చిపోతూ వుంటే బంధుత్వం
**
"అవ్వా! నిజ్జంగా మీ పెద్దోళ్ళు శానా శానా మంచోళ్ళవ్వా! మీరేజ్జెప్పినా మా మంచికని గిప్పుడిప్పుడే తెలుత్తున్నది.గిన్ని దినాలు ఏంది గీళ్ళ శాదత్తం శెవుల జొర్రీగలెక్క ఏదోటి శెప్తనే వుంటరన్కున్న.నీ మాట సుబూది అయ్యిందవ్వా!"
"ఏందిరా అయ్యా! గియ్యాలేందో నన్ను పట్టి పట్టి ములకశెట్టు ఎక్కిత్తాన్నవ్. గదాని మీంచి లటుక్కున పడ్తే గదేదో సూడాలని కాయుషుగుందా ఏంది?"
"శా నియ్యవ్వా! నేనింత మంచిగ శెప్తుంటె పెడార్తం తీస్కుంటవేందే?" నీ మాటలు నాకు తాకొచ్చినయ్ గందుకే శెప్తున్న. "
ఏదో లే అయ్యా! నవ్వుతాలుకు అన్నగని గవేందో శెప్పు. ఏం తాకొచ్చినయ్?"
"గదేనవ్వా! ఎవలన్న కట్టంలో వున్నప్పుడు పైసల సాయమడిగితే గది పెద్దదా శిన్నదాని యిశారిచ్చి యియ్యాలె అన్నవు గద.ఎవలికెందుకీయాలె అనుకున్న గని గియ్యాల దెల్శింది. ఎందుకియ్యాల్నో.గట్లిత్తనే మడుసులం గద! '
"అవునురా అయ్యా! నీ పూలు పుటికెల బడ భలేగా శెప్పినవ్. గింతకీ గదేందో జెప్పు."
గదేం లేదవ్వా! మా దోత్తు గీ నడ్మల ఓ సాయం అడ్గితేె మొకం మీదనే లేదని శెప్పిన.ఆటెంక తెల్సింది గానికి శాన్నే కట్టమొచ్చిందనీ, దోత్తుల్లో ఒకలు సాయం జేసిండంట.
"గాన్నైతే సయిమానికి ఆదుకుండని దేవుని లెక్క సూత్తుండు.గీల్లింట్లె పండే కాయగూరలు పండ్లు తీస్కపొయ్యి ఎంతొందన్నా ఇత్తుండంట. గాడు,గీడు ఇద్దరు శెప్పిర్రు. గప్పుడు నేను సుత ఇత్తే బాగుండేది పాపిట్టోన్ని గప్పుడు నా నాలిక్కేం పుట్టిందో ఉండి లేదన్న.గిప్పుడు తెల్శొత్తుందవ్వా!"
"ఆలీశమైన అర్తం శేస్కున్నవ్ లేరా అయ్యా!"
"గాల్లిద్దరి ఇండ్లకు బోతున్న.ఎన్నల్లేంది తమాశిగ వొచ్చిండని ఒకటే పేమ జేసుడు.నేను సుత శేల బండిన లేత మక్క పొత్తులు,శెనిక్కాయలు తీస్కబొయ్యి ఇత్తుంటే గాల్ల పొల్లగాండ్లకి ఎక్కల్లేని సంబురం గాదుపో,మావయ్యొత్తే వొట్టి శేతుల్తో రాడని సుట్టు శేరి ముచ్చట్లు శెబుతుర్రు.
" గంతేరా అయ్యా! ఎవలైన సరె గని ఇచ్చిపుచ్చుకుంటే యవ్వారం- వొచ్చిపోతూ వుంటే బందుత్తం" లేక పోతే ఎవలికి వారే యమునా తీరే.
"అవునవ్వా మొన్న పేటకి బొయినప్పుడు పెద్దవ్వింటికి బోయిన. గానించి శంకర్ మావ, పెద్దత్త ,మన డుంబు గానింటికి పొయ్యొచ్చినవ్వ. మంచిగ అన్పిచ్చింది.గాళ్ళు సుత మంచిగొచ్చిన్నని ఒకటే సంబుర పడుడు. గట్ల నడ్మ నడ్మల వొచ్చిపోరా అయ్యా !అన్నరు."
"అవున్రా కట్ట సుఖాలు పంచుకుంటే బర్వు తీరుద్ది. ఇచ్చిపుచ్చుకుంటేనే పేమలు పెర్గుతయి. వొచ్చి పోతూ వుంటే సుట్టాలు బందుత్తం ఎరికైతది.గిరి గీసుకుని వుంటే ఎవలొత్తరు? శెప్పు."
అవునవ్వా ఎంతుంటేంది? సుట్టాలు పక్కాలు ఉండాలే.వొత్తా పోతా వుంటే గా యిల్లు కళకళ్ళాడుద్ది."
"గదండీ సంగతీ! ఇచ్చి పుచ్చుకుంటే వ్యవహారం - వచ్చి పోతూ వుంటే బంధుత్వం."

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి