తాండూరు తెలంగాణ గురుకుల బాలికల పాఠశాలలో కార్గిల్ విజయ్ దివస్:వెంకట్ , మొలక ప్రతినిధి

 తాండూరు పట్టణంలోని తెలంగాణ గురుకుల బాలికల పాఠశాలలో జూలై 26 కార్గిల్ విజయ్ దివస్‌ను పురస్కరించుకుని ఘనంగా కార్గిల్ డే వేడుకలను నిర్వహించారు. 2012లో సోషల్ వర్కర్ కేవీఎం వెంకట్ ప్రారంభించిన ఈ కార్యక్రమం ఆనవాయితీగా గడచిన 14 సంవత్సరాలుగా నిరంతరం కొనసాగుతోంది. ఇందులో భాగంగా పాఠశాలలో అమర జ్యోతిని వెలిగించారు.
​దేశ సరిహద్దుల రక్షణ కోసం విరోచితంగా పోరాడి వీరమరణం పొందిన సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ అమర జ్యోతి వెలిగించి, రెండు నిమిషాలు మౌనం పాటించి, సైనికులకు సెల్యూట్ చేస్తూ ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు.
​ముఖ్య అతిథుల సందేశాలు:
​తాండూర్ డి.ఎస్.పి నర్సింగ్ యాదయ్య: జమ్ము కాశ్మీర్ సరిహద్దు ప్రాంతంలో మైనస్ 40 డిగ్రీల ఉష్ణోగ్రతలో సైతం ప్రాణాలను లెక్కచేయ  చేయకుండా దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమర సైనికులను స్మరించుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు సైనికుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని, దైవభక్తితో పాటు దేశభక్తిని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. నేటి సమాజంలో విద్యార్థులు ఆత్మపరిశీలన చేసుకుంటూ లోకజ్ఞానంపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
​కల్వకుర్తి అక్షర వనం, వందేమాతరం ఫౌండేషన్ ఫౌండర్ కార్యదర్శి మాధవ రెడ్డి: కార్గిల్ యుద్ధంలో యోగేంద్ర యాదవ్, సంజయ్ కుమార్ లాంటి సైనికులతో పాటు మొత్తం 527 మంది వీరమరణం పొందారని గుర్తుచేశారు. వారి త్యాగాలను స్మరిస్తూ ప్రతి ఒక్కరూ తాము చేసే పనిలో నిబద్ధత, సత్యంతో మెలగాలని పిలుపునిచ్చారు. భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో నిలపాలంటే భగత్ సింగ్ లాంటి వారి త్యాగగుణం విద్యార్థులకు అవసరమన్నారు. విద్యార్థులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలని, అన్నం మెతుకును కూడా వృధా చేయకూడదనే మంచి అలవాటును నేటి నుండే అలవర్చుకోవాలని సూచించారు. జీవితానికి ప్రణాళిక వేసుకుని సాంఘిక సైనికులుగా ఎదగాలని ఆకాంక్షించారు.
​ప్రత్యేక ఆకర్షణలు & సత్కారాలు:
​మాజీ సైనిక ఉద్యోగి సత్కారం: 28 సంవత్సరాల పాటు దేశ సేవ చేసి విశ్రాంతి తీసుకున్న మాజీ సైనిక ఉద్యోగి అమీనుల్లా ఖాన్‌ను ఈ వేదికపై ఘనంగా సత్కరించారు.
​బహుమతుల ప్రదానం: ఆల్ ఇండియా మార్వాడి యువ మంచ్ ప్రతినిధులు విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, డ్రాయింగ్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. అలాగే
 బాలల మాసపత్రిక 'మొలక', 'మొల్ల కళావేదిక' తరపున విద్యార్థులకు ప్రశంసా సర్టిఫికెట్లను పంపిణీ చేశారు.

బాలల మాసపత్రిక 'మొలక', 'మొల్ల కళావేదిక' తరపున విద్యార్థులకు ప్రశంసా సర్టిఫికెట్లను పంపిణీ చేశారు.అనంతరం ముఖ్య అతిథులు మొక్కలు నాటారు.
​ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ కన్వీనర్ కేవీఎం వెంకట్, ప్రిన్సిపల్ ప్రవీణారెడ్డి, మన్మోహన్ శారద, ఏజీవో శ్రీనివాస్, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు మరియు విద్యార్థినిలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.​ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ కన్వీనర్ కేవీఎం వెంకట్, ప్రిన్సిపల్ ప్రవీణారెడ్డి, మన్మోహన్ శారద, ఏజీవో శ్రీనివాస్, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు మరియు విద్యార్థినిలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కామెంట్‌లు