తెలిసి తెలియక కొత్తగా
మదిలో రేగే తలపుల్లా
విరిసీ విరియని పూల ఊయల
తనదైన పరిమళమేదో
తోట నిండా పరవాలని
తపన పడుతూ తరిస్తూ
తలిరాకుతో కలిసి తూగుతూ
తన అందం తనకు తెలియక
తన ఆనందమే తన వరమని
తలచి విరిసి మురిసే సుమాలు
తోరణాలై స్వాగతించే తరుణాన,
ఏటి చెక్కిలి అద్దపులోన
మేటి రంగుల హంగులు చూసి
సాటి తనకెవరూ అనుకుని
కోటివెలుగులు పంచే రేడు!
వెచ్చని స్పర్శకు పులకించి
చక్కని రూపు తిలకిస్తూ
అచ్చెరువై కదలక నిలిచి
అంజలి ఘటించే చెరువు
కనువిందగు దృశ్యము
కనుల ముందు కనిపించగా
మనము మోదముతో నిండి
ఆనందించు హృదయాలకు
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి