మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన నేను చాలా అదృష్టవంతుడను. నా జీవితానికి స్ఫూర్తి ఉన్నతికి నైతిక విలువలు నేర్పినది నా జన్మకుకారకులైన తండ్రి
మా నాన్నగారు ప్రముఖ గాంధేయవాది. తాను నమ్మిన సిద్ధాంతానికి జీవితమంతా కట్టుబడిన మహనీయులు.మానవత్వమే మాధవత్వమని సేవే పరమావధి గా జీవించిన వ్యక్తి నాకన్నా మా మేనల్లుళ్లు పెద్దవారు. వారికి సుమారు ఏబది సంవత్సరాల వయస్సులో పుట్టిన నాకు వారు దైవమే అని అనిపించే సంఘటనలు ఎన్నో ఉన్న ఒక సంఘటనను చెబుతాను
వారికి అరువది సంవత్సరాల వయస్సులో సుమారు నేను ఆరో తరగతి చదువుతున్న రోజులు. మంచి వేసవికాలం. వీధిలో బక్కచిక్కిన స్త్రీ అనారోగ్య కారణం చే విరోచనాలతో పడిపోతే నాన్నగారితో బాటు నేను వెళుతున్నప్పుడు చూసాము. రోడ్డు మీద వెళుతున్న వారు ఎవరు పట్టించుకోకుండా వెళుతున్నారు.
మా నాన్నగారు పైనున్న కండువా తీసి ఆమెను శుభ్రపరచి ప్రసాదు ఇంట్లోకి తీసుకెళ్లడానికి సహాయం చెయ్యి అని తీసుకెళ్లి అక్కయ్య తెచ్చిన నీళ్ళతో శుభ్రపరచి నీళ్ళు త్రాగించి విషయం అడిగితే నేను బాగా బ్రతికిన ఆమెను పూర్ణయ్య బాబు .ఏ విషయం చెప్పను అంటే అలాగే నమ్మా. పరమాత్ముడిచ్చిన జీవితం సద్వినియోగం చేసుకోవాలి అని మా ఇంట్లో రెండు రోజులుంచి తానే స్వయంగా ప్రేమసమాజంలో అనాథ స్త్రీని తాను నెల నెల డబ్బులు పంపించి సహాయం చేస్తామంటే ప్రేమ సమాజం అధ్యక్షులు డాక్టర్ కోరుకొండ సుబ్బరాజు గారు పూర్ణయ్య గారు మీరు మనుషుల్లో దేముడు అని ప్రవేశం కల్పించారు.
అప్పుడు ఇంట్లో అక్క పిల్లలు ఆరుగురు మా మేనత్త, అమ్మ వచ్చే పోయే వారు పూటకి పదిమంది ఉండే మధ్య తరగతి కుటుంబం. మా అమ్మ నాన్న గారిని మంచి పని చేసారు అని ఎప్పుడు ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో అని మన వెనుక వచ్చేది మనం చేసే మంచి పనులే అంటు అనడం జ్ఞాపకమే.
నాన్నగారు సాయినాథుడు శ్రీరామచంద్రుని దరి చేరిన రోజునే డెబ్భై ఆరో ఏట వెళితే ఆమె వచ్చి సాయి నాకు తెలియదు. నా పాలిట సాయి పూర్ణయ్య బాబే అని అనడం ఊరు ఊరంతా నాన్నగారి అంత్యేష్ఠి సంస్కారానికి రావటం జరిగి నలభై ఏళ్లయినా ఎన్నాళ్ళు జీవించామన్నది కాదు ఎంత మంచిగా ఉన్నామన్నది చనిపోయిన తరువాత కూడా ప్రజలు చెప్పుకుంటే అన్న నాన్నగారు నా ఉన్నతికి ,సంస్కార జీవితానికి స్ఫూర్తి.
.........................
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి