బాదం పప్పుల భారతి: -డా. కందేపీ రాణీప్రసాద్
 

హలో పిల్లలూ! బాదం పప్పులు, జీడి పప్పులు పప్పులు బాగా తింటుంటారు కదా! జీడి పప్పు పాకం, డ్రైఫ్రూట్‌ లడ్డూలు, బాదం పాలు మీకిష్టమే కదా! మరి మనమీరోజూ బాదం పప్పులు, కిస్‌మిస్‌లు ఉపయోంగించి పాపాయిని తయారు చేశాను. ఇలా అందమైన ఆకారాల్లో డ్రైఫ్రూట్స్‌ను అమరిస్తే మీరు బాగా తింటారని తల్లుల ఆశ. చూశారా మన పాపాయి ఎంత బాగుందో! బాదం చెట్టు 'రోజేసి' కుటుంబానికి చెందిన చెట్టు. దీని శాస్త్రీయ నామం ‘ఫ్రూనస్ డల్లిస్’. వీటిని ఇంగ్లీషులో ’ఆల్మండ్‘ అంటారు. వీటిని తినడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తెల్ల రక్త కణాల సామర్ధ్యం పెరుగుతుంది. బలవర్ధకమైన ఆహారం కోసం ఈ బాదం గింజల్ని తింటారు. దీనిబవల్ల రక్తపోటు సమస్య తక్కువగా ఉంటుంది. ఇందులో సోడియం శాతం తక్కువగానూ, పొటాషియం శాతం ఎక్కువగానూ ఉంటుంది. కాబట్టి రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. ఇందులో లభించే కాల్షియం వలన ఆస్పియో పోరోసిన్ రాకుండా నిరోధించవచ్చు. ఎముకలు ధృడంగా ఉండటానికి తోడ్పడుతుంది. చెడు కొవ్వు శాతాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. వీటిలో పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎన్ని విషయాలు చెప్పుకున్నా బలవర్ధకమైన ఆహారంగా ప్రశంసలు అందుకున్నది.
బాదం పప్పులతో స్కర్ట్, జాకెట్ కుట్టాను. నల్ల ద్రాక్షతో అమ్మాయిని తయారు చేశాను. అమ్మాయికి పోనీ టెయిల్ వేసి బాదం పప్పుల దండను పెట్టాను. జాకెట్‌కు కాలర్ డిజైన్ చేశాను. ఈ అమ్మాయికి ఇంకా చెవులు కుట్టించలేదు. ఇప్పుడు మంచి రోజులు కావు. చెవులు కుట్టించాక మంచి జూకాలు పెడతాను. లిప్‌స్టిక్ కూడా పెట్టలేదు. బాదం, కిస్‌మిస్‌ల పాప బాగుందా!.
కామెంట్‌లు