మంబాపూర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో గ్రంథాలయ ప్రారంభం: వెంకట్ , మొలక ప్రతినిధి
 – విద్యార్థుల విజ్ఞాన వికాసానికి కంజర్ల విజయలక్ష్మి చేయూత


 వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలం మంబాపూర్(ZPHS) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల పఠనాభిరుచిని పెంపొందించేందుకు ఏర్పాటు చేసిన నూతన గ్రంథాలయాన్ని కంజర్ల విజయలక్ష్మి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు కంజర్ల విజయలక్ష్మి, గ్రామ సర్పంచ్ భార్గవి శ్రీనివాస్‌తో కలిసి శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా కంజర్ల విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందని, విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని తెలిపారు. విద్యార్థులు పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.
పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు మోహన్ సార్ తరగతి గదిని గ్రంథాలయంగా తీర్చిదిద్దేందుకు, పుస్తకాల కొనుగోలుకు తనవంతుగా రూ.40 వేల మేర సహకారం అందించారు. ఉపాధ్యాయులు సుధాకర్ 5 వేలు, ఆనందం రూ.10 వేల చొప్పున విరాళం అందించగా, కంజర్ల విజయలక్ష్మి ఫౌండేషన్ తరఫున కూడా రూ.10 వేల విలువైన పుస్తకాలను అందజేశారు.
పాఠశాల అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ మొలక పుస్తకాల కోసంసంవత్సరం చందా అందించారు
ఈ కార్యక్రమంలో బాలల మాసపత్రిక మొలక స్పెషల్ కరస్పాండెంట్ KVM వెంకట్ మాట్లాడుతూ పాఠశాల గ్రంథాలయానికి స్వామి వివేకానంద జీవిత చరిత్ర, స్ఫూర్తిదాయక పుస్తకాలను అందజేస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం కంజర్ల విజయలక్ష్మిని గ్రామ సర్పంచ్, ఉపాధ్యాయులు, గ్రామస్తులు ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ పావని, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్,  పెద్దముల లైబ్రరీ ఇన్‌చార్జి రఘు, పాఠశాల లైబ్రరీ ఇన్‌చార్జి మోహన్, ఉపాధ్యాయులు ఆనందం, సుధాకర్, విజయలక్ష్మి, అశోక్, నజియా, ఎం. నిర్మల, యు. నిర్మల, సల్మా అంజుమ్, ఆనంద్, ఆంజనేయులు, సంగీత, మమత, యాదమ్మ, శేఖర్, స్వరూప, పీడీ కృష్ణయ్యతో పాటు విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
గ్రంథాలయం విద్యార్థుల్లో పఠనాభిరుచిని పెంపొందించడంతో పాటు విజ్ఞాన వికాసానికి ఎంతో దోహదపడుతుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేశారు.
కామెంట్‌లు