అయోధ్యకు విచ్చేసి, రాజ్యపాలన స్వీకరింపుమని
భరతుడు శ్రీరాముని అభ్యర్థించుట
కృష్ణాజినమును జటావల్కలములను దాల్చి
ఈ ప్రదేశమునకు వచ్చిన కారణమేమి?
వనమునకు ప్రవేశించగల హేతువేమి?
నేను వినగోరుచున్నాను తెలుపుము.
రాముని మాటలు విన్న భరతుడు
దుఃఖమును బలవంతంగా ఆపు కొనుచు
శ్రీరామునితో ఇలా అంటాడు
పూజ్యుడా! మహా ప్రభువైన మన తండ్రి
ఒక స్త్రీ కారణముగా నిన్ను వనములకు పంపెను
జేష్టుడు పాలించవలసిన ఈ రాజ్యమును
కనిష్టుడు రాజ్యపాలన ఎలా చేస్తాడన్నా?
ఓ శత్రుసంహారకా! ఆయన భార్యయు
నాకు తల్లైయిన కైకేయి ప్రోత్బలముచే
తండ్రి ఈ ఘోర కార్యమునకు పాల్పడి
పుత్రశోకముతో స్వర్గస్తుడైనాడు
అన్నా నేను ఎప్పటికీ నీ దాసుడనే అనుగ్రహించి
కోసల రాజ్యమునకు పట్టాభిశక్తుడవు కమ్ము
భర్తను కోల్పోయిన తల్లులందరు
నీ సమీపమునకు విచ్చేసి యున్నారు కదా!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి