105 వ సర్గ : - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
 తండ్రి ఆజ్ఞ శిరోధార్యమని భరతునితో శ్రీరాముడు హితవు పలుకుట 




భరతుడు శ్రీరామునితో ఇలా అంటాడు
సోదరా! మా తల్లిని సంతృప్తి పరచుటకై 
తండ్రిగారు నాకీరాజ్యమును ఇచ్చినారు 
నా ఆధీనంలో యున్న ఈ రాజ్యమును, 

అన్నా! శ్రీరామా! నేను నీకు సమర్పించుచున్నాను
ఈ కోసలరాజ్యమును నీవు పరిపాలించుము.
ఈ విశాల రాజ్యమును రక్షించుటకు 
నీకు తప్ప ఎవరికి సాధ్యము కాదు. 

ఓ ప్రభ్రూ! అశ్వగమనము గాడిదకు కుదరనట్లు 
గరత్మంతుని గగనయానము
చిన్నపక్షికి సాధ్యము కానట్లు
నీ వలె రాజ్యపాలన చేయుటకు 
నాశక్తి చాలదు అది అసాధ్యమవును.

ఓ మహాప్రభూ! శత్రు సంహారసమర్థుడవైన
నీవు సింహాసనమును అధిష్టించి
వెలిగే సూర్యకిరణాలవలె బాసిల్లుచుండగా 
అయోధ్య ప్రజలు నిన్ను జూచి సంతోషించెదరు. 

మిక్కిలి దుఃఖితుడై విలపించుచున్న 
ఆ భరతుని జూచి శ్రీరాముడు ఓదార్చెను 
సోదరా! ఏ వ్యక్తికైనా దైవము వలె 
ఇష్టమువచ్చినట్లు ప్రవర్తించె శక్తి ఉండదు.

కామెంట్‌లు