ఆమెను చంపుట ధర్మము గాదు
నేను ధర్మబద్ధుడను అందువలన
ఆ పాపకారి తల్లిని చంపలేకపోతున్న.
నా తల్లి కైకేయిని,నన్ను. మనతండ్రిని
బంధుమిత్రులను,పౌరులను, పల్లెవాసులను
అందరిని కాపాడుటకు నీవే సమర్ధుడవు
నా ప్రార్థనలను మన్నించి అయోధ్యకు రమ్ము
ఓ ప్రభూ!వనవాసమెక్కడ? క్షాత్రధర్మమెక్కడ?
జటాధారణమెక్కడ? పరిపాలన ఎక్కడ?
పరస్పర విరుద్ధములైన కర్మలను
నీ వంటి పూజ్యుడు ఆచరింపతగదు.
ప్రజాపాలనరూపమైన క్షత్రియధర్మము
ప్రత్యక్ష ఫలములను ఇచ్చునది
అటు ప్రభువు నకు ఇటు ప్రజలకు
శుభలాభములను చేకూర్చును ఓ అగ్రజా
ఓ రఘువరా! శాస్త్ర జ్ఞానమున
జన్మ క్రమమున
అనుసరించిన నేను నీకంటే చిన్నవాడను
జ్యేష్టపుత్రుడవు నీవు ఉండగా
నేను రాజ్యమును ఎట్లు పాలించగలను.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి