శాలిగౌరారం మండల పదవ తరగతి టాపర్స్ కు మాదావరం కలాన్, 1988-89 బ్యాచ్ పూర్వ విద్యార్ధుల చేయూత


  80 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ZPHS మాదావరం కలాన్ లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా 2025 -26 బ్యాచ్ పదవ తరగతి ఫలితాలలో శాలిగౌరారం మండల టాపర్ గా నిలిచిన ZPHS మాదావరం కలాన్ విద్యార్థిని ముషం దివ్యశ్రీ కి 5,000/- రూ , మరొక విద్యార్థిని పిట్టల శిరీష కు 2,500/- రూపాయాలను నగదు బహుమతిగా 1988-89 బ్యాచ్ పూర్వ విద్యార్ధులు అందించడం జరిగింది, 1988-89 బ్యాచ్ తరుపున Y భీష్మారెడ్డి(ఊట్కూర్), మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు దామెర్ల కృష్ణయ్య(ఓగోడ్) గార్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
 అదే విధంగా ఈ పాఠశాల ఉపాధ్యాయులు పి.లోకనాదం గారు, ముషం దివ్యశ్రీ కి 5,000/- మరియు  పి.శిరిష,జి.అక్షిత లకు 1116/- చొప్పున నగదు బహుమతిగా అందించారు 
ఇదే పాఠశాలకు చెందిన తెలుగు ఉపాధ్యాయురాలు జి.ఆండాలు గారు కూడా ముషం దివ్యశ్రీ, శిరీష మరియు అక్షిత లకు 516/- చొప్పున ముగ్గురికి నగదు బహుమతిగా అందించారు 
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు లగిశెట్టి సత్యనారాయణ మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులను, దాతలను అభినందించారు
కామెంట్‌లు