తెలుగు భాష సాంస్కృతిక సంస్థ-మంగళవారం తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ, ఉషోదయ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించినఠ ముందస్తు "స్నేహం-పవిత్రం" అంశంపై విశిష్ట ప్రతిభ కనబరిచిన విశ్రాంత ప్రధానాచార్యులు, సామాజిక విశ్లేషకులు, సహస్ర కవి, రచయిత, పరిశోధకులు, వక్త గుర్రాల లక్ష్మారెడ్డికి "మిత్ర రత్నావళి"బిరుదు పురస్కారం 2026 ప్రధానం చేసి, ప్రశంసా పత్రంతో ఘనంగా సత్కరించారు. గుర్రాల లక్ష్మారెడ్డి
2022 వరకు జిహెచ్ఎంగా సేవలందించి పదవీ విరమణ చేశారు. విద్యా రంగం తో పాటు సాహిత్య, చారిత్రక, జానపద అంశాల శోధన, సామాజిక సేవ రంగాల్లో విశేష కృషి సల్పారు. రచయితగా, వ్యాసకర్తగా, పరిశోధకుడిగా, గుర్తింపును పొందారు. 300కు పైగా కవితలు, 75 కు పైగా వ్యాసాలు, 20 పైగా నాటికలు, 18 పైగా పేరడీలు, విద్యార్థుల పాఠ్యాంశాలకు సంబంధించిన
రచనలను చేశారు. అంతే కాకుండా 8 పుస్తకాలను ప్రచురించారు.
తాను ప్రస్తుతం సామాజిక విశ్లేషకునిగా రచనలు చేస్తూ, ప లు స్వచ్ఛంద సంస్థల ద్వారా కార్యక్రమాలను నిర్వహిస్తూ సామాజిక సేవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు
ఈ ప్రధాన పురస్కార కార్యక్రమాన్ని డా!!యు.వి. రత్నం, మరియు డా! ధనాశి ఉషారాణి నిర్వహించారు. గుర్రాల లక్ష్మారెడ్డికి ఈ ప్రతిష్టాత్మక బిరుదు లభించడం పట్ల పలు స్వచ్ఛంద సంస్థలు, సాంస్కృతిక ప్రతినిధులు, సాహితీవేత్తలు, కళాకారులు అభినందనలు తెలియజేశారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి