గారపల్లి అనే గ్రామంలో అన్ని బిల్డింగులేఉన్నాయి అందరు ధనవంతులు.గర్వమెక్కవగాఉండేది.అసలు ఊర్లో ఎవరికి మనసాక్షి లేదు. రోజు మాయమాటలతో చిన్న వ్యాపారులను,రైతులను మోసం చేసి,
డబ్బు సంపాదించేవారు. ఒకరోజు వాళ్ళ గ్రామంలోకి సుశీల తన కొడుకు ప్రభాస్ వాళ్ళ ఊర్లోకి వచ్చారు.వారు పేదవారు.ఎదైన పనిచేసి బతుకుదామని వస్తారు. తమ పేదరికం చూసి అందరూ అసూయపడ్డారు.ఎవరుగూడ పనిఇవ్వలేదు. అలా పొద్దటి నుండి సాయంత్రం అయింది.ఇద్దరికి ఆకలవుతుంది.తల్లి ఆకలి ఎలా తీర్చాలి అని ప్రభాస్ ఆలోచిస్తాడు.ప్రక్కనే ఉన్న చెత్తబుట్టలోకి తొంగి చూస్తే అందులో పాఢైపోయిన అరటిపండ్లు కనిపిస్తాయి. ఇద్దరు వాటిని తిని హాయిగా పడుకున్నారు.అర్థ రాత్రి చూస్తే తల్లి సుశీలకు జ్వరం వచ్చింది.ఈ విషయం గమనించిన ప్రభాస్ పనికి వెళ్లి మందులు,అన్నం తీసుకొని వస్తాడు.తల్లికి ఆహారం తినిపించి మందులు వేస్తాడు.ఒరేయ్!ప్రభాస్! నీకు ఇంత డబ్బు ఎక్కడిది అని తల్లి అడిగింది.దానికి ప్రభాస్ ఇలా అంటాడు. అమ్మ నాకు ఒక పోలీస్ అతను మన పరిస్థితిని గమనించి డబ్బు సహాయం చేశాడమ్మా అని అబద్ధం చెప్తాడు.
కానీ నిజానికి అతను రాత్రి నిద్ర లేస్తాడు.తన తల్లికి జ్వరం వచ్చిందని గమనిస్తాడు.రాత్రి ఒంటిగంట అవుతుంది. ఎక్కడికెళ్లాలని ఆలోచిస్తాడు.రాత్రి పూట హోటల్స్ తెరిచిఉన్నాయి. యజమానుల దగ్గరికి వెళ్లి ఈ రాత్రికి పనిఇవ్వుమని బతిమిలాడుతాడు. కొంతమంది యజమాలు ఇవ్వరు.ఒక అతను మాత్రం చిన్న పిల్లవాడు కదా!అని పని ఇస్తాడు.
తెల్లవారినంక అన్నము మందులు తీసుకుని వస్తాడు.కానీ తన తల్లికి విషయం చెప్తే బాధపడుతుందని చెప్పడు.
తల్లిచెప్పినట్లుగా ప్రభాస్ వింటాడు.అమ్మ పనులు చేసుకుంటు బాగా చదివిస్తుంది.అప్పుడప్పుడు అమ్మకు తోడుగా పనులకు వెళ్లేవాడు.తల్లిమాటలు విన్నవారు ఎన్నడు చెడిపోరని గట్టిగా నమ్మేవాడు.కష్టపడి ఉద్యోగం సంపాదిస్తాడు. సొంత ఇల్లు కట్టుకున్నారు. తన తల్లిని బాగా చూసుకున్నాడు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి