తన శాపం గూర్చి దశరథుడు కౌసల్యకు తెలుపుట
ఈ మహాపాతకమునుండి విముక్తుడనగుట యెట్లు?
అనుకుంటూ ఒంటరిగా ఆలోచిస్తూ
అనంతరం నాకు నేను ధైర్యం తెచ్చుకొని
ఆ పాత్రలో నీళ్లు నింపుకొని దానిని దీసుకొని
ఆ బాలుడు చెప్పిన బాటను అనుసరిస్తూ
వారు యున్న ఆశ్రమమునకు చేరితిని
ఆశ్రమమున ఆ వృద్ధులను జూచితిని
వారు బలహీనులు, వృద్ధులు, అందులు
వారు రెక్కలు విరిగిన పక్షులవలె
ఎటూ కదల లేకుండా యుండిరి
వారి కుమారుని రాకకై ఎదురుజూచుచుండిరి
నా అడుగుల చప్పుడు విని ఆముని ఇట్లు పలికెను
నాయనా! కుమారా! ఇంత ఆలస్యమేలా?
త్వరగా నీటిని తెమ్ము దాహము తీర్చుకొందుము
మా కడకు త్వరగా రమ్ముకుమారా!
ఆశ్రమమున ఆ మునిని చూడగానే
నాకు మిక్కిలి భయము కలిగెను
నాలోని భయమును నిగ్రహించుకొని
ధైర్యముతో అతని ముందుకు వెళ్ళినాను

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి