65వ సర్గ : - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
దశరథ మహారాజు మృతికి విలవిలలాడుతున్న  కౌసల్య. సుమిత్ర




అర్ధరాత్రి దశరథుడు మృతి చెందుట వలన 
కౌసల్య, సుమిత్ర గాఢ నిద్రలో యుండిరి 
సూర్యోదయముతో అంతఃపుర స్త్రీలు 
మహారాజును మేలుకొలుపుటకు

మేళ తాళాలతో గానము చేయుచుండిరి
ఆ మహారాజు మేలుకొనుటలేదు 
అప్పుడు వైద్యుడు వచ్చి చూసి 
దశరథుడు మృతి చెందాడని తెలుపగా 

కౌసల్య ,సుమిత్ర, అంతఃపుర స్త్రీలు 
గొల్లుమని బొబ్బపెట్టుచు ఏడ్చినారు 
పుత్రుల ఎడబాటుతో మహారాజు 
మృతి చెందాడని కైకేయుని తిట్టారు 

కౌసల్య, సుమిత్ర, రాజును స్పృశించుచు 
అయ్యో! జీవితేశ్వరా! అంటూ ఏడుస్తూ మూర్ఛిల్లిరి
తరవాత ఆచటికి వచ్చి చూసిన ప్రజలు 
కౌసల్యను, సుమిత్రను పట్టుకొని ఏడ్చెను 

వాసిగాంచిన ఆ నరేంద్రుడు దివంగతుడైనట్లు యెరిగి
అతని పత్నులందరును మిక్కిలి దుఃఖితులై 
ఆయన చుట్టూ జేరి ఏడ్చుచుండిరి 
దిక్కులేని వారివలె దీనముగా విలపించ సాగిరి 

=================================

అయోధ్యకాండము నందు 65వ సర్గ సమాప్తము
కామెంట్‌లు