మహారాజు మృతికి మిక్కిలి దుఃఖితురాలైన కౌసల్యా దేవి
ఆరిపోయిన అగ్నివలెను నీరింకిన సముద్రము వలె
నిర్జీవుడైన తన పతిని జాచి కౌసల్యాదేవి
పరిపరివిధముల శోకించుచుండెను
ఓ కౄరురాలా! దుర్మార్గురాల! ఓ పాపి!
నీ మనసులోని కోరికలు తీరెను గదా!
మహారాజును వదిలించుకుంటివి
ఇక నీకు అడ్డు చెప్పేడి వారే లేరు
మహారాజు మరణించి యున్నాడు
ఇచ్చట నేను అనాధనైయుంటిని
ధర్మాత్ముడైన శ్రీరాముడు దూరాన యుండెను
ఈ విషయములను అతడు ఎరగడు
పవిత్రమైనట్టి నేను మృతి చెందిన ఈ మహారాజుతో
నేడే సహగమనము చేసెదను
ఆయన దేహంతో పాటు నా తనువును గూడా
చితాగ్నికి ఆహుతి గావించెదను.
పతి పార్తీవదేహము వద్దా కౌసల్యాదేవి
సీతారామ లక్ష్మణులను దలచుకొని
విలపించుచున్న కౌసల్యాదేవిని
పరిచారికులు దూరముగా తీసుకువెళ్లిరి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి