అనగనగ ఒక అడవి అడవిలో ఒక నక్క, ఒక పంది, అడవికి రాజు అయిన సింహం, అలాగే మిగతా జతువులన్నీ ఉండేవి. ఇందులో నక్క చాలా తెలివైనది. ఒక రోజు నక్కకు పంది మెదడు తినాలనే కోరికపుట్టింది. నక్క కాసేపు ఆలోచించింది. దానికి ఒక ఉపాయం వచ్చింది. ఆ ఉపాయం ప్రకారం అడవికి రాజైన సింహం దగ్గరకు వెళ్లి, సింహం రాజా నీకు పంది మాంసం తినాలని ఉందా అని అడిగింది నక్క. అప్పుడు సింహం తినాలని ఉంది కానీ దాన్ని ఎవరు పట్టుకొస్తారు అని అన్నది. మీకెందుకు నేను పట్టుకొస్తాను గదా! మీరు ఇక్కడ విశ్రాంతి తీసుకోండి అని అన్నది. నక్క అలా నడుస్తూ పోతుండగా దానికి పంది కనిపించింది. దాని దగ్గరికి వెళ్లి, పందీ పందీ నిన్ను సింహం రాజు అడవికి రాజును చేద్దామని అనుకుంటుంది. నిన్ను పిలుచుకురమ్మన్నది రా.. అని నక్క పందితో అన్నది. అప్పుడు పంది అడవికి రాజు సింహం కదా! మరి నన్ను ఎందుకు అడవికి రాజును చేయాలనుకుంది. ఎందుకంటే సింహం ముసలిది అయింది కదా అందుకే అడవికి రాజును చేయాలనుకుంది అని అన్నది నక్క. సరే అని పంది నక్క సింహం దగ్గరికి బయలుదేరాయి. పంది సింహం దగ్గరకు వెళ్ళగానే సింహం తొందర తట్టుకోలేక పంది మీదికి దుకాలనీ ప్రయత్నించగా, అది గ్రహించిన పంది అడవిలోకి ఉరికింది. అప్పుడు నక్క ఏందీ సింహం రాజా ఆలా చేసారు. నేను ఎంత కష్టపడి దాన్నీ తీసుకొచ్చాను అని అన్నది. దాన్ని చూడగానే ఆత్రుత పుట్టింది అని అన్నది సింహం. సరేలే నేను మళ్లీ వెళ్లి పందిని తీసుకొస్తాను అని అడవిలోకి వెళ్ళింది నక్క. నక్క పంది దగ్గరికి వెళ్లి, నువ్వు ఎందుకు అక్కడి నుంచి వచ్చేశావు అని అన్నది.అప్పుడు పంది ఆ సింహం నన్ను చంపబోయింది అని అన్నది. కాదు కాదు అలా కాదు. సింహం నిన్ను చంపాలనుకోలేదు, నీ కాళ్ళు మొక్కాలని మొక్కాలని అనుకుంది అని నక్క పందితో చెప్పింది. అలా మళ్ళీ ఇద్దరూ కలిసి సింహం దగ్గరకు వెళ్లారు. సింహం నమస్కారం చేస్తున్నట్లు నటించి పంది మీదికి దూకి చంపేసింది. తరువాత దాన్ని తిందామని దగ్గరికి వెళ్తుంటే, సింహం రాజా మీకాడ చెడువాసన వస్తుంది. మీరు స్నానం చేసి వచ్చి తినండి. అంత లోపల నేను ఈ పంది మెదడుకు కాపలా కాస్తాను అని నక్క అనగా, ఔను నువ్వు చెప్పేది కూడ నిజమే. నేను స్నానం చేసాకే తింటా అని స్నానానికి వెలుతుంది సింహం. సింహం స్నానం చేసి వచ్చే లోపల నక్క సింహం మెదడును తినేస్తుంది. సింహం స్నానం చేసి వచ్చి చూస్తే పంది మెదడు ఉండదు. అప్పుడు సింహం నక్కను పంది మెదడెక్కడ అని అడుగుతుంది. అప్పుడు నక్క సింహం రాజా దానికి మెదడే ఉంటే రెండోసారి పిలువగానే వచుండేది కాదు కదా అని అంటుంది. అప్పుడు సింహం ఔను నిజమే కదా అనుకొని మిగిలిన పంది మాంసాన్ని తింటుంది.
నీతి :- చెప్పుడు మాటలు చేటు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి