ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బడిపిల్లల సృజనాత్మకత కోసమే సాహిత్య కార్యశాలను నిర్వహించినట్లు మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల విద్యాధికారి పి.బాల్ రామ్ అన్నారు. ఆగష్టు 27 న దేవరకద్ర మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో తెలంగాణ సారస్వత పరిషత్, శాంతా వసంతా ట్రస్ట్ సౌజన్యంతో ఉన్నత పాఠశాల విద్యార్ధులకు నిర్వహించిన సృజనాత్మక సాహిత్య కార్యశాలకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి, వారి ప్రతిభను ప్రోత్సహించేందుకు పాఠశాల స్థాయి నుంచే కృషి జరగాలని పిలుపునిచ్చారు. ప్రతి విద్యార్థిలోనూ అపారమైన శక్తిసామర్థ్యాలు ఉంటాయని, వాటిని గుర్తించి వెలికితీసే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న శక్తిసామర్ధ్యాలను వెలికితీసేందుకు కార్యశాలను నిర్వహించినట్లు, త్వరలోనే విద్యార్థులందరితో కథలు రాయించనున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థుల్లో పఠనం, రచన, సృజనాత్మక ఆలోచనలను పెంపొందించే కార్యక్రమాలను పాఠశాలల్లో విస్తృతంగా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. విషయనిపుణులు, ప్రముఖ కవి, రచయిత బోల యాదయ్య విద్యార్థులకు బాలల కథారచనలో మెలకువలను తెలియజేశారు. కథా వస్తువు, ఎత్తుగడ, పాత్రలు, భాష, ముగింపు తదితర అంశాలను ఉదాహరణలతో సహ వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్ష, కార్యదర్శులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, డాక్టర్ జుర్రు చెన్నయ్యతో పాటు గరిపెల్లి అశోక్ లు పంపిన ప్రశంసాపత్రాలను, పుస్తకాలను అతిథులు అందజేశారు. ఈ కార్యశాలలో దాదాపు 80 మంది విద్యార్థులు
పాల్గొని శిక్షణ పొందారు. ఈ కార్యక్రమంలో బాలికల ఉన్నత పాఠశాల స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు నాగేంద్రమ్మ, ఇంఛార్జి ప్రధానోపాధ్యాయులు విజయకుమార్, తెలుగు పండితులు పాల్ సుధాకర్, ఉపాధ్యాయులు గోపాల్ రెడ్డి, పూడూరు నాగరాజు, శ్రీపాల్ రెడ్డి, రాఘవేంద్రస్వామి, దివ్యభారతి, రమేశ్ \తదితరులు పాల్గొన్నారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి