దూతలు వసిష్టుని ఆదేశమును భరతునికి తెలుపుట
రమ్యమైన నగరమున ప్రవేశించిరి
తమ కడకు వచ్చిన దూతలను కేకయరాజు
తన కుమారుడైన యధాజిత్తు
ఆధరసత్కారములతో గౌరవించిరి
ఆ దూతలు అయోధ్యకు రాజు కానున్న
భరతుని పాదములకు నమస్కరించి
"నాయనా! ఓ భరతా!
మా మాటలను వినుము
వంశ పురోహితుడైన వసిష్ఠ మహర్షి ,మంత్రులందరు
మీ క్షేమాచారముల గూర్చి ప్రస్తావించరి
అయోధ్యలో మీరు అత్యవసరముగా
నిర్వహించవలసిన కార్యము గలదు
కనుక మీరు వెంటనే మాతో బయలుదేరుడు
ఓ రాజకుమారా! అమూల్యములైన
ఈ వస్త్రాభరణములను స్వీకరింపుడు
వీటిని మీ తాత గారికి సమర్పింపుడు
భరతుడు ఆ కానుకలను స్వీకరించెను
వాటిని మహారాజునకు మేనమామకు అర్పించి
భోజనములతో దూతలను సంతృప్తిపరిచెను
మా తండ్రి దశరథమహారాజు కుశలమేనా?
మహాత్ములైన రామలక్ష్మణులు కుశలమేనా?

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి