భరతుడు రథాసీనుడై అయోధ్యకు చేరుట
తూర్పు ముఖముగా పయనించి
వారు నదులు పర్వతాలు దాటి వెళ్ళుతూ
భరతుడు పశ్చిమదిశగా ప్రవహించే
సరస్వతినది గంగానది కలిసి పారునట్టి
ప్రదేశమును జేరి పిమ్మట ఉత్తరదిశనగల
వీరమత్స్యదేశములమీదుగా వెళ్ళును
మిక్కిలి వేగముగా ప్రవహించే
కుళింగము అనే యమునానదిని దాటి
ఎండలకు అలసిపోయిన సైన్యముతో
యమునానది తీరమున అతడు విశ్రమించెను
అశ్వములకు గ్రాసములను సమకూర్చి
వారంతా అచ్చట స్నానాలు ముగించుకొని
దారిలో దాహము తీర్చుకొనుటకై
కొంతనీటినితీసుకొని ముందుకు సాగిరి
వారు ఆ రాత్రి అంతయు ప్రయాణించి
మనుప్రభువుచే నిర్మితమైన అయోధ్యను దర్శించి
నరసేష్టుడైన ఆ భరతుడు ఆ మార్గమున
ఏకధాటిగా ఏడు రోజులు ప్రయాణించెను

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి