కౌసల్యదేవి సమక్షమున భరతుడు పరితపించుట
మంత్రులు, ప్రజలు, పురోహితులు
కైకేయి భవనమునకు విచ్చేసిరి
భరతుడు వారి ముందు తల్లిని నిందిస్తూ
ఓమంత్రుల్లారా!నా మాటలను వినుడు
కేకయపురము నుండిప్పుడే వచ్చినాను
ఈ రాజ్యాధికారమును నేను ఆశించలేదు
నేను నా తల్లితో ఆలోచన జేసి యెరగను
శ్రీరాముని వనవాసము గూర్చి నాకు తెలియదు
శోకిస్తూ అతడు మంత్రులతో జెప్పెను
అతని కంఠ ధ్వని విన్న కౌసల్యాదేవి
సుమిత్రా!భరతుడు దూరదృష్టి గలవాడు
మనము అతనిని చూచుటకై వెళ్ళుదాము
కౌసల్యా,సుమిత్రా కలిసి వచ్చుచుండిరి
అప్పుడే భరతుడు శత్రుజ్ఞునితో గూడి
కౌసల్యాదేవి వద్దకు బయలుదేరినాడు
దురావస్థకు గురైన కౌసల్యా దేవిని చూసి
భరత శత్రఘ్నులు మిక్కిలి దుఃఖితులైరి
శోకసంతృప్తులై ఆమెను కౌగిలించుకొని
వారచట వెక్కి వెక్కి ఏడవసాగిరి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి