భరతుడు తన తండ్రి దశరథునకు అంత్యక్రియలోనర్చుట
వసిష్ట మహర్షి ఆయనతో ఇట్లు నుడివెను
"ఓ రాజకుమారా! మహా యశస్వి
ఇది శోకమునకు సమయము కాదు
మహారాజుకు ఉత్తమ గతులు కలుగుటకై
అంత్యక్రియలు జరిపే సమయమిది
కర్తవ్యంనకు సిద్ధపడుమని చెప్పగా
భరతుడు మనస్సు, కుదట పరచుకొనెను
అతడు తండ్రి దశరథునకు విధ్యుక్తముగా
ప్రేతసంస్కారములను ప్రారంభించెను
తైలదోని నుండి అతని పార్దీవదేహము తీసి
స్నానాదిసంస్కారములను ముగించిరి
రత్నములు తాపిన పాడే పై పరండపెట్టిరి
భరతుడు తండ్రిని చూసి దుఃఖించుచుండెను
ఓ తండ్రి నీవేమో స్వర్గస్తుడవైతివి
శ్రీరాముడేమో వనములకు జేరెను
నీవు నిన్నటి వరకు పాలించిన
ఈ పుర ప్రజల క్షేమము చూచేదెవరు?
ఓ మహారాజా! నీవు లేకపోవుటచే
ఈ రాజ్యము దిక్కులేనిదై కళావిహీనమైనది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి