77వ సర్గ :- ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట

భరత శత్రుజ్ఞులు  తమ తండ్రికి అగ్ని సంస్కారములు చేసిన చోట  విలపించుట 




పదిదినములు గడిచిన పిమ్మట 
పదకొండవదినమున భరతుడు 
శుద్ధి పుణ్యావచనక్రియను ఆచరించెను 
పన్నెండవరోజున శ్రాద్ధకర్మలను నిర్వహించెను 

భరతుడు బ్రాహ్మణులకు రత్నములను 
ధనములను అమూల్యమైన వస్త్రములను 
వివిధములగు ఆభరణాలను ఒసంగెను
పురప్రజలకు అన్నదానము జేసెను

పదమూడవ దినమున చితి వద్దకు వెళ్లి 
భరత శత్రఘ్నులు మిక్కిలి దుఃఖించిరి
తండ్రి అస్థికలను చేతులోకి తీసుకొని 
శోకవివశుడై  భరతుడు విలపించసాగెను

ఓ తండ్రి! నీవు నన్ను మా అన్నయైన
శ్రీరాముని చేతిలో పెట్టి పోతివా రాజా! 
అతడిప్పుడు వనవాసియై యున్నాడు
నన్ను ఒంటరి వాడిని చేసితిరా!

తండ్రిని దహన మొనర్చిన స్థలమును జూచి 
భరతుడు అచట గట్టిగా ఏడ్చెను 
అతడు ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయెను 
శత్రజ్ఞుడు దుఃఖముతో నేలపై బడెను 

కామెంట్‌లు